Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ను కారుతో ఈడ్చుకుపోయిన డ్రైవర్

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ను కారుతో ఈడ్చుకుపోయాడు ఓ కారు డ్రైవర్. ఫుట్ పాత్ పై నిలబడిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పై వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఎదురు తిరిగి ప్రశ్నించటంతో ఆమెను కారుతో పాటు ఈడ్చుకుపోయాడు.

Delhi : ఢిల్లీ మహిళా కమిషన్  చైర్ పర్సన్‌ను కారుతో ఈడ్చుకుపోయిన డ్రైవర్

DCW chief Swati Maliwal dragged by drunk driver

Delhi :  దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా తయారైంది. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు,దోపిడీలు జరుగుతున్న క్రమంలో ఏకంగా మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ సైతం వేధింపులకు అతీతంకాలేదు. ఓ కారు డ్రైవర్ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పై వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళల రక్షణను పరిరక్షించి, పర్యవేక్షించే మహిళా కమిషన్ చైర్ పర్సన్ పైనే వేధింపులకు దిగటం గమనించాల్సిన విషయం. ఆడది కనిపిస్తే చాలు వెర్రివేషాలతో వెర్రెత్తిపోయే కొంతమంది మగవారికి తల్లికి చెల్లికి కూడా తేడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.

అటువంటి ఈ సమాజంలో దేశ రాజధాని ఢిల్లీలో మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ తో ఓకారు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బరితెగింపుగా ప్రవర్తించాడు. ఎదురు తిరిగిన ఆమెను ఏకంగా కారుతో కొంతదూరం ఈడ్చుకుపోయాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ గేట్ 2 దగ్గర గురువారం (జనవరి 19,2023) ఉదయం 3 గంటల సమయంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి స్వాతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో  ఆమె ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎదురు తిరగారు. దీంతో ఆమెను 10 నుంచి 15 మీటర్ల దూరం కారుతో లాక్కెళ్లిపోయాడు. కాస్త దూరంలో వదిలేశాడు. దీంతో స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. అతడిని 47 ఏళ్ల హరీశ్ చంద్ర గుర్తించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ గేట్ 2 దగ్గర గురువారం ఉదయం మూడు గంటల సమయంలో ఫుట్ పాత్ పై స్వాతి మలివాల్ తన టీమ్ తో కలిసి నిలబడ్డారు. ఇంతలో అక్కడికి కారులో వచ్చిన హరీశ్ చంద్ర.. తన కారులో కూర్చోవాలని స్వాతి మలివాల్ ను వేధించాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వాతి కారు వద్దకు వెళ్లి డోర్ పై చెయ్యి వేసి ప్రశ్నంచబోయారు. దీంతో అతను ఆమె చెయ్యిపైనే విండో గ్లాస్ ను క్లోజ్ చేసి అలానే కొద్దిదూరం కారును నడిపుతూ లాక్కెళ్లిపోయాడు. ఆ తరువాత వదిలేశాడు. దీంతో ఆమె కారు నంబర్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి 323, 341, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

డిసెంబర్ 31న రాత్రి స్కూటర్ పై వెళ్తున్న అంజలీ సింగ్ అనే మహిళను కొందరు కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల దూరం ఆమెను కారుతో ఈడ్చుకెళ్లారు ఈ ఘటనలో ఆమె చనిపోయింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మరువకముందే ఏకంగా మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కు అలాంటి పరిస్థితే ఎదురుకావడం ఆందోళన కలిగిస్తోంది.