Lizard Rat In Mid day Meal : బాబోయ్.. నిన్న పాము నేడు బల్లి, ఎలుక.. పిల్లలకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో మళ్లీ ఘోరం

వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్ లో దారుణం జరిగింది. పిల్లలకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక, బల్లి కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. స్కూల్ దగ్గరికి చేరుకుని ఆందోళనకు దిగారు. స్కూల్ సిబ్బంది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Lizard Rat In Mid day Meal : బాబోయ్.. నిన్న పాము నేడు బల్లి, ఎలుక.. పిల్లలకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో మళ్లీ ఘోరం

Lizard Rat In Mid day Meal : వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో దారుణాలు ఆగడం లేదు. ఘోరాల మీద ఘోరాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మధ్యాహ్న భోజనంలో పాము బయటపడిన ఘోరం మరువక ముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈసారి మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక, బల్లి కనిపించడం కలకలం రేపింది.

మాల్దా జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్ లో దారుణం జరిగింది. పిల్లలకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక, బల్లి కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. స్కూల్ దగ్గరికి చేరుకుని ఆందోళనకు దిగారు. స్కూల్ సిబ్బంది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Also Read..West Bengal: మధ్యాహ్న భోజనంలో పాము.. అన్నం తిన్న పలువురు విద్యార్థులకు అస్వస్థత

దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. మధ్యాహ్న భోజనంలో చనిపోయిన ఎలుక, బల్లి కనిపించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్కూల్ లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంపై స్థానికులు అసంతృప్తిగా ఉన్నారు. అస్సలు నాణ్యత లేని భోజనాన్ని పిల్లలకు పెడుతున్నారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం చాలా అధ్వాన్నంగా ఉంటోందని పిల్లలు వాపోయారు. దీనిపై అనేక సార్లు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని స్థానికులు చెప్పారు.

వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇటీవలే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసింది. నాన్ వెజ్,  గుడ్డు, సీజనల్ పండ్లను చేర్చింది. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే దారుణాలు బయటపడుతున్నాయి.

Also Read..Mid-Day Meals: మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్.. వారానికోసారి చికెన్, గుడ్లు, పండ్లు ఇవ్వనున్న బెంగాల్ ప్రభుత్వం

దీనిపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. పిల్లలకు నాసిరకమైన, నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. స్కూల్స్ లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. నాణ్యత లేని ఆహారం పిల్లలకు పెడుతున్నారు. దీంతో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషిత ఆహారం తిని వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారుల్లో మార్పు మాత్రం రావడం లేదు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో మెరుగు కనిపించడం లేదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇటీవలే బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పాము బయటపడింది. ఇది గుర్తించేలోపే చాలా మంది విద్యార్థులు ఆ ఆహారం తీసుకున్నారు. ఈ భోజనం తిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది వాంతులు చేసుకున్నారు. అయితే ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.