DA Hike : ముందే వచ్చేసిన దీపావళి, ఉద్యోగులకు డీఏ పెంపు..ఎంత పెరిగిందో తెలుసా ?

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. కరువు భత్యం (డీఏ) పెంచాలని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

DA Hike : ముందే వచ్చేసిన దీపావళి, ఉద్యోగులకు డీఏ పెంపు..ఎంత పెరిగిందో తెలుసా ?

Da

Dearness Allowance (DA) Hike : దీపావళి పర్వదినం రావడానికి కొద్ది రోజులు ఉంది. అయితే..ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. కరువు భత్యం (డీఏ) పెంచాలని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2021, అక్టోబర్ 26వ తేదీ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. 28 శాతం ఉన్న డీఏను 31 శాతానికి పెంచుతూ…ఆ ప్రకటనలో వెల్లడించింది. గత జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఏడో వేతన కమిషన్ సిఫార్సులను అనుగుణంగా…కనీస వేతనాన్ని పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది.

Read More : Nykaa ఉద్యోగుల జాక్‌పాట్.. ఏకంగా రూ.850 కోట్లు సంపాదన

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఈ డీఎ పెంపు…డిఫెన్స్ సర్వీసులు, రైల్వే ఉద్యోగులకు కూడా…వర్తిస్తుంది. దీనిపై డిఫెన్స్ రైల్వే మంత్రిత్వ శాఖ వేర్వేరు ప్రకటనలు చేయనున్నాయి. గత సంవత్సరం జూలైలో డీఏ 17 నుంచి 28 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. మరో మూడు శాతం పెంచుతూ ..ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోవడంతో…మొత్తం డీఏ 31 శాతానికి చేరుకుంది.

Read More : AP CM : విద్యార్థులకు స్పూర్తి సీఎంఓ అదనపు కార్యదర్శి ముత్యాలరాజు…ఆయన ప్రస్థానం

దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి సంవత్సరం రూ. 9 వేల 488.70 కోట్ల భరం పడుతుందని అంచనా. కరోనా వైరస్ కారణంగా…ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…డీఏలను పెంచడానికి కేంద్రం సాహసం చేయలేదు. గత మూడు డీఏలు కల్పించలేదు. గత జూలై ఒకటో తేదీన డీఏల పెంపుపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ..కేంద్రం నిర్ణయం తీసుకుంది.