DA Hiked : ఉద్యోగులకు డీఏ,పెన్షనర్లకు డీఆర్ 3శాతం పెంపుకి కేబినెట్ ఆమోదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)మూడు శాతం అదనపు పెంపుకి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. అదేవిధంగా

DA Hiked : ఉద్యోగులకు డీఏ,పెన్షనర్లకు డీఆర్ 3శాతం పెంపుకి కేబినెట్ ఆమోదం

Da

Central Employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)మూడు శాతం అదనపు పెంపుకి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. అదేవిధంగా కేంద్ర పెన్ష‌ర్ల‌కు కూడా మూడు శాతం డియర్‌నెస్ రిలీఫ్(DR)పెంపుకి ఆమోదం తెలిపింది కేబినెట్.

డీఏ,డీఆర్ ను 17 నుంచి 28 శాతానికి పెంచేందుకు ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మూడు శాతం పెంపుతో.. డీఏ 31 శాతానికి చేరుకోనునుంది. పెంచిన డీఏ,డీఆర్ ను జులై-1, 2021 జనవరి 1 నుంచి వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం తాజా నిర్ణయంతో 47.14లక్షల కేంద్రప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. డీఏ,డీఆర్ పెంపు వల్ల ప్రభుత్వంపై ఏటా 9,488 కోట్ల భారం పడనుంది.

ALSO READ RML హాస్పిటల్ ను సందర్శించి..సెక్యూరిటీ గార్డులను అప్యాయంగా పలకరించిన మోదీ