Eknath Shinde: మహారాష్ట్ర సీఎంను చంపుతామంటూ బెదిరింపు కాల్స్.. మరింత పటిష్ట భద్రత ఏర్పాటు

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను చంపుతామంటూ ఆయనకు ఆదివారం బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఈ కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Eknath Shinde: మహారాష్ట్ర సీఎంను చంపుతామంటూ బెదిరింపు కాల్స్.. మరింత పటిష్ట భద్రత ఏర్పాటు

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను చంపుతామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఆదివారం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అంశంపై దృష్టి సారించారు.

CM KCR New Party: దసరా రోజు మరోసారి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ.. ఆ రోజే కొత్త పార్టీపై ప్రకటన?

మరోవైపు సీఎం షిండేకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం మలబార్ హిల్‌లోని అధికారిక నివాసమైన ‘వర్ష’లో ఉంటున్నారు. అధికారులు ‘వర్ష’తోపాటు, ఆయన సొంత నివాసమైన థానేలోని ఇంటి వద్ద కూడా భద్రతను మరింత పెంచారు. కాగా, రాష్ట్ర ఇంటెలిజెంట్ విభాగం ముఖ్యమంత్రి భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించనుంది. షిండే భద్రతపై దృష్టి సారించింది. ఇప్పటికే ముఖ్యమంత్రికి ‘జడ్ కేటగిరి’ భద్రత ఉంది.

TRS Or BRS: టీఆర్ఎస్ కాదు.. ఇకపై బీఆర్ఎస్! దసరా రోజే ప్రకటన.. ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్

తాజా బెదిరింపుల నేపథ్యంలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించనున్నారు. కాగా, ఫోన్ కాల్‌కు సంబంధించిన వివరాల్ని అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవలే తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.