Credit Debit Card Tokenisation : క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు రిలీఫ్.. ఆ నిబంధన 6నెలలు వాయిదా

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకనైజేషన్‌ విధానం అమలు నిర్ణయాన్ని ఆర్బీఐ మరో ఆరు నెలలు వాయిదా వేసింది. దీంతో కొత్త టోకనైజేషన్‌ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.

Credit Debit Card Tokenisation : క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు రిలీఫ్.. ఆ నిబంధన 6నెలలు వాయిదా

Credit Debit Card Tokenisation

Credit Debit Card Tokenisation : క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకనైజేషన్‌ విధానం అమలు నిర్ణయాన్ని ఆర్బీఐ మరో ఆరు నెలలు వాయిదా వేసింది. దీంతో కొత్త టోకనైజేషన్‌ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. టోకనైజేషన్ పాలసీ అమల్లోకి వస్తే.. ఆన్ లైన్ కొనుగోళ్లకు సంబంధించి ఏదైనా లావాదేవీ జరపాలంటే క్రెడిట్, డెబిట్ కార్డుపై ఉన్న వివరాలను ప్రతిసారి ఎంటర్ చేయాలి. వివరాలు సేవ్ అవ్వాలంటే టోకనైజ్ చేసుకోవాలి.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కొత్త రూల్ ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి 1 తో కొత్త రూల్ అమల్లోకి రావాల్సి ఉంది. ఇప్పటికే ఆయా బ్యాంకులు మర్చంట్ వెబ్‌సైట్ లేదా పలు యాప్‌లో క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను స్టోర్ చేసే విషయంలో ఖాతాదారులను అలర్ట్‌ చేశాయి. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు ఊరట కలిగింది. టోకనైజేషన్‌ విధానాలతో ఆయా క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్ వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్‌లైన్ కొనుగోళ్లను అనుమతిస్తుంది.

Gmail user ALERT : మీ ఆండ్రాయిడ్, ఐఫోన్ నుంచి Secret email ఇలా పంపుకోవచ్చు!

ఇటీవల టోకనైజేషన్‌ను అమలు చేయడానికి కనీసం ఆరు నెలల సమయాన్ని ట్రేడ్‌ యూనియన్‌ వ్యాపారులు కోరారు. దీని అమలు పలు అంతరాయాలను కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ కొత్త నియమాల కారణంగా ఆన్‌లైన్ మర్చంట్స్‌ తమ రాబడిలో 20 నుంచి 40 శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతంలో తెలిపింది.

ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం… 2020-21లో భారత డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ విలువ రూ. 14,14,85,173 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించాయని సీఐఐ తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 98.5 కోట్ల కార్డులున్నాయని అంచనా. వీటితో ఒకే రోజు సుమారు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని సీఐఐ వెల్లడించింది.

ఇకపై ఆన్‌లైన్‌ లావాదేవీలలో కార్డు పైనున్న వ్యక్తిగత వివరాలు, సీవీవీ నెంబర్‌ను ఎంటర్‌ చేసే పని లేకుండా టోకనైజేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ టోకనైజేషన్‌ అంటే ఏమిటి? ఎలా పొందాలి?

Xiaomi 11i Hypercharge : ఫాస్ట్ హైపర్‌‌చార్జ్ స్మార్ట్‌ఫోన్‌.. 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. జనవరి 6న వచ్చేస్తోంది!

టోకనైజేషన్‌ అంటే ?
వినియోగదారుల డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆర్బీఐ టోకనైజేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ట్రాన్సాక్షన్‌ జరిపే సమయంలో కార్డు వివరాలు సైబర్‌ నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా సెక్యూర్‌ గా ఉంచే వ్యవస్థనే టోకెన్‌ అంటారు. ట్రాన్సాక్షన్‌ చేసే సమయంలో వినియోగదారుడు 16 అంకెల కార్డ్‌ నెంబర్‌ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ తెచ్చిన టోకనైజేషన్‌ ద్వారా ట్రాన్సాక్షన్‌ చేసిన ప్రతిసారి వ్యక్తిగత, కార్డ్‌ వివరాలు, సీవీవీ నెంబర్‌లను ఎంట్రీ చేసే అవకాశం లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు.

టోకనైజేషన్ ఎలా పొందాలి?

* ఆన్‌ లైన్‌ ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో మీ కార్డ్‌ వివరాలు ఎంటర్ చేసినప్పుడు.. ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్‌వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతి కోసం రిక్వెస్ట్ పంపిస్తాయి.

* ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి.

* ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి.

* తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే.. కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది.