VHP, Bajrang Dal: వీహెచ్‭పీ, బజరంగ్‭దళ్‭లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలంటూ ఐఎంసీ చీఫ్ డిమాండ్

ఫిబ్రవరి 16న భివానీలో జునైద్, నసీర్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు పూర్తిగా కాలిపోయి మృతదేహాలుగా కనిపించారు. ఇద్దరు బాధితులను గోసంరక్షకులు అపహరించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. బజరంగ్ దళ్‌తో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులకు అరెస్ట్ చేశారు. జునైద్, నసీర్‌లను రాజస్థాన్ నుంచి అపహరించి హర్యానాకు తీసుకెళ్లి హత్య చేశారు

VHP, Bajrang Dal: విశ్వహిందూ పరిషద్ (వీహెచ్‭పీ), బజరంగ్‭దళ్‭లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించి వాటిని నిషేధించాలని ఇత్తిహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్ డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం హర్యానాలోని భివానీలో ఇద్దరు ముస్లిం వ్యక్తులను కిరాతకంగా హతమార్చిన ఘటనపై ఆయన స్పందిస్తూ ఈ డిమాండ్ లేవనెత్తారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మీద నిషేధం విధించినట్లే ఆ రెండు సంస్థలపై సైతం నిషేధం విధించాలని సూచించారు.

Congress Plenary Session: బీజేపీపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు.. తన రాజకీయ రిటైర్మెంట్‌పైనా ప్రస్తావన ..

‘‘ఫిబ్రవరి 16న భివానీలో దారుణ ఘటన జరిగింది. మా పిల్లలపై (జునైద్‌, నసీర్‌) తప్పుడు ఆరోపణలు చేసి హత్య చేశారు. నిందితులకు మద్దతుగా సమావేశాలు, మహాపంచాయతీలు జరిగాయి. హత్యలు, మూకదాడులు అనేది ఈ దేశంలో సర్వసాధారణం అయిపోయాయి. అవి ఎవరు చేస్తున్నారో, ఏ పేరుతో చేస్తున్నారో అందరికీ బహిరంగమే. వీహెచ్‭పీ, బజరంగ్‭దళ్‭ సంస్థలకు చెందినవారమని నిందితులే స్వయంగా చెప్తున్నారు. ఆ రెండు సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలి. వాటిపై నిషేధం విధించాలి” అని ఐఎంసీ చీఫ్‌ అన్నారు.

2024 General Polls: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

“భివానీలో జరిగిన సంఘటన హిందూ సమాజానికి కూడా తప్పుడు సందేశాన్ని పంపుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే, వారిని కూడా హీరోలుగా ముద్ర వేస్తారని మిగతావారు అనుకోవచ్చు. పాలకులు ఈ విషయాన్ని గమనించాలి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. రాబోయే రోజులు మరింత ప్రమాదకరంగా మారుతాయి” అని అన్నారు.

భివానీ మరణాలు
ఫిబ్రవరి 16న భివానీలో జునైద్, నసీర్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు పూర్తిగా కాలిపోయి మృతదేహాలుగా కనిపించారు. ఇద్దరు బాధితులను గోసంరక్షకులు అపహరించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. బజరంగ్ దళ్‌తో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులకు అరెస్ట్ చేశారు. జునైద్, నసీర్‌లను రాజస్థాన్ నుంచి అపహరించి హర్యానాకు తీసుకెళ్లి హత్య చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఎనిమిది మంది నిందితులపై రాజస్థాన్ పోలీసులకు ఖచ్చితమైన ఆధారాలు లభించాయని అధికారులు పీటీఐకి తెలిపారు. అయితే ఈ కేసులో బజరంగ్ దళ్ సభ్యుడు మోను మానేసర్ పాత్రపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.

Doctor Negligence : ఆపరేషన్ అనంతరం కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులందరూ ఆవుల స్మగ్లర్లను పట్టుకోవడానికి గోసంరక్షకులుగా ప్రైవేట్ ఆపరేషన్ చేస్తున్నట్లు తమ విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో జునైద్, నసీర్ ప్రయాణిస్తున్న బొలెరో కారును అడ్డగించారు. నిందితులు ఇద్దరిని కొట్టారని, ఇద్దరు బాధితులను కొట్టిన తర్వాత హర్యానా తీసుకెళ్లారు. ఈ కేసులో అరెస్టయిన నిందితురాలు రింకూ సైనీని విచారించడంతో సంబంధిత వివరాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad Central University : హెచ్ సీయూలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ

రుజువు లేకుండా తమ పార్టీ సభ్యులపై కేసు పెట్టడం సరికాదని భజరంగ్ దళ్ పేర్కొంది. తన కుమారుడిని పట్టుకునేందుకు జరిపిన దాడిలో తమపై దాడి చేయడంతో గర్భవతి అయిన తన కోడలు తన బిడ్డను కోల్పోయిందని ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై హర్యానా పోలీసులు 30 నుంచి 40 మంది రాజస్థాన్ పోలీసు సిబ్బందిపై కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు