Uttar Pradesh: వృద్ధుడికి శాపంగా మారిన అధికారుల నిర్లక్ష్యం.. బతికుండగానే చనిపోయినట్లు నమోదు.. ఆగిపోయిన పెన్షన్

బతికుండానే ఒక వృద్ధుడు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు ప్రభుత్వ అధికారులు. దీంతో ఆ వృద్ధుడికి పెన్షన్ ఆగిపోయింది. బ్యాంకు లావాదేవీలు కూడా నిలిచిపోయింది. ఇవన్నీ కావాలంటే బతికే ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకోవాలి అంటున్నారు అధికారులు.

Uttar Pradesh: వృద్ధుడికి శాపంగా మారిన అధికారుల నిర్లక్ష్యం.. బతికుండగానే చనిపోయినట్లు నమోదు.. ఆగిపోయిన పెన్షన్

Uttar Pradesh: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అనేకసార్లు సామాన్యులకు కష్టాలు తెచ్చిపెడుతుంటుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఒక వృద్ధుడు కూడా అధికారుల తప్పు వల్ల కష్టాలు పడుతున్నాడు. ఉత్తర ప్రదేశ్, షాజహాన్ పూర్ ప్రాంతంలోని ఫతేపూర్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల ఓం ప్రకాష్ అనే వృద్ధుడికి ఏడాది కాలంగా వృద్ధాప్య పెన్షన్ రావడం లేదు.

Singer Vaishali Bursala: సింగర్ వైశాలి హత్య కేసులో వీడిన మిస్టరీ.. చంపించింది స్నేహితురాలే.. ఎందుకో తెలుసా?

కారణం.. ప్రభుత్వ రికార్డుల్లో అతడు చనిపోయినట్లు ఉండటమే. తాను బతికే ఉన్నాను.. పెన్షన్ ఇప్పించండి అని ఎంత వేడుకుంటున్నా ఏడాది కాలంగా అధికారులు పట్టించుకోవడం లేదు. బతికే ఉన్నట్లు తెలిపే లైఫ్ సర్టిఫికెట్ తెచ్చుకోమని సూచించారు. దీంతో అతడు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. పైగా అతడి చెరుకు పంట కూడా నష్టపోయాడు. తిరిగి వ్యవసాయం చేద్దామన్నా, అప్పు తీసుకుందామన్నా సాధ్యం కావడం లేదు. కారణం ప్రభుత్వ రికార్డుల ప్రకారం అతడు చనిపోయి ఉండటమే. ఇక వృద్ధాప్య పెన్షన్ కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాడు ఓం ప్రకాష్. చివరకు చెరుకు పంట ద్వారా వచ్చిన సొమ్ము బ్యాంకు నుంచి తీసుకుందామన్నా సాధ్యం కావడం లేదు.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్

తన దుస్థితిపై స్పందించి ఆదుకోవాలని అతడు ప్రభుత్వ అధికారుల్ని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ను మీడియా సంప్రదించగా, ఈ అంశంపై ఓం ప్రకాష్ వద్దకు ప్రభుత్వాధికారుల్ని పంపి విచారణ జరుపుతామని, ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.