Coronavirus: దేశంలో తగ్గిన కొవిడ్ కొత్త కేసులు.. 10మంది మృతి

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆది, సోమ వారాల్లో 3వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు.. మంగళవారం తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో..

Coronavirus: దేశంలో తగ్గిన కొవిడ్ కొత్త కేసులు.. 10మంది మృతి

India Covid-19 cases

Coronavirus: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆది, సోమ వారాల్లో 3వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు.. మంగళవారం తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 4.84 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 2,288 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. 24గంటల వ్యవధిలో 3,044 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ కావటం గమనార్హం. కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 10మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు దేశంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5.24 లక్షలకు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 4.31కోట్ల మంది కొవిడ్ బారిన పడగా, అందులో 98.74 శాతం మంది కరోనా వైరస్ ను జయించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా నిర్వహిస్తున్న టీకా పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది.

Covid-19 Update : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 3,207 కేసులు, 29 మరణాలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో తగ్గుముఖం పట్టింది. చైనా, దక్షిణాఫ్రియా దేశాల్లో మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ల రూపంలో వైరస్ విరుచుకుపడుతుండటంతో లాక్ డౌన్‌లు విధిస్తున్నారు. కానీ భారత్‌లో కరోనా పూర్తిగా కంట్రోల్ ఉంది. అయితే ఇటీవల పదిరోజులుగా వరుసగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు వేగంగా పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్ వ్యాప్తి తగ్గినప్పటికీ ఎప్పుడైనా పెరిగే అవకాశముందని, ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.