దీపికా పదుకొనెపై స్మృతీ సంచలన వ్యాఖ్యలు : తుక్డే గ్యాంగులకు ఆమెగారు పరామర్శలా..

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 08:30 AM IST
దీపికా పదుకొనెపై స్మృతీ సంచలన వ్యాఖ్యలు : తుక్డే గ్యాంగులకు ఆమెగారు పరామర్శలా..

జేఎన్ యూలో జరిగిన దాడుల్లో గాయపడిన విద్యార్ధులను పరామర్శించిన బాలీవుడ్ నటి దీపికా పదుకునేపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగులకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్న దీపికా పదుకొనె స్వేచ్ఛను తప్పుబట్టలేమంటూ హేళనగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో గురువారం (జనవరి 9)జరిగిన ఓ సదస్సులో స్మృతి పాల్గొన్న సందర్భంగా..స్మృతి ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని నాశనం చేయాలనుకునవారికి..దేశాన్ని  విచ్ఛిన్నం చేయాలనుకునేవారికి దీపికా మద్దతుగా నిలువటం ఆమె ఇష్టమని అన్నారు.  

ఇది పెద్దగా ఆశ్చర్యపడాల్సి విషయం కాదనీ ఈ విషయం తాము ముందే ఊహించాననీ ఈ విషయం వార్తలు చదివే ఎవరికైనా ఈ విషయం తెలుస్తుందని అన్నారు. 2011లో కాంగ్రెస్‌కు మద్దతు పలికినప్పుడే రాజకీయాలతో దీపికాకు సంబంధం ఉన్నందనీ అందుకే ఆమె జేఎన్ యూకు వెళ్లారని అన్నారు. అలా తుక్డే తుక్డే గ్యాంగులకు మద్దతుగా నిలిచిన ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బహుశా.. ఆమె కూడా అటువంటి వ్యక్తినే అని చాటి చెప్పిందంటూ మంత్రి వ్యాఖ్యానించారు. 

ఆదివారం (జనవరి 5) జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముసుగు ధరించిన వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించి.. విద్యార్థులపై దాడి చేశారు. ఈ దాడిలో 30మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై దాడిని పలువురు ఖండించారు. గాయపడిన విద్యార్ధులను పరామర్శించేందుకు 7న క్యాంపస్‌కు వెళ్లి దీపిక పరామర్శించారు. విద్యార్థులకు మద్దతుగా దీపిక నిలవడాన్ని పలువురు ప్రశంసించారు. 

విద్యార్ధులను పరామర్శించేందుకు దీపికా వెళ్లటంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె సినిమాలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. కానీ బాలివుడ్ నుంచేకాక అన్ని వర్గాల నుంచి దీపికాకు మద్దతు వచ్చింది. ఇది బీజేపీ శ్రేణులు భరించలేకపోతున్నారు. పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.