JNU కి వెళ్లిన దీపికా నిజమైన హీరో

JNU(జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థులపై దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సంఘీభావం తెలిపిన

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 03:09 AM IST
JNU కి వెళ్లిన దీపికా నిజమైన హీరో

JNU(జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థులపై దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సంఘీభావం తెలిపిన

JNU(జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థులపై దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి స్పందన వచ్చింది. కొందరు దీపిక తీరుని తప్పుపడితే మరికొందరు స్వాగతించారు. నిజమైన అందం అంటే ఇదే అని కొందరు ప్రశంసిస్తే.. సినిమా పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తోందని ఆరోపించారు. బాయ్ కాట్ ఛపాక్, ఐ సపోర్ట్ దీపికా, ఛపాక్ దేఖో తపాక్ సే వంటి హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో పెద్ద చర్చలే నడుస్తున్నాయి. దీపిక సినిమాని బహిష్కరించాలని బీజేపీ ఎంపీ రమేశ్ బిధురి పిలుపునిచ్చారు. అదే సమయంలో కొందరు సినిమా వాళ్లు దీపికకు అండగా నిలిచారు. దీపిక నిజమైన హీరో అని దర్శకుడు విక్రమాదిత్య ప్రశంసించారు. డైరెక్టర్ మహేష్ భట్, నటి సోనాక్షి సిన్హా, నిర్మాత అపర్ణాసేన్ తదితరులు ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేశారు.

మంగళవారం(జనవరి 7,2020) జేఎన్‌యూకు వెళ్లిన దీపీక పదుకొనె దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. ఈ క్రమంలో నెటిజన్లు దీపికను విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఛపాక్‌ను చూడొద్దని బాయ్ కాట్ చేయాలని పిలునిచ్చారు. సినిమా ప్రచారం కోసం దీపీకా పదుకొనే దిగజారిపోయిందని, దేశ ద్రోహులపై ప్రేమ ఒలకబోస్తుందని విమర్శలు కురిపిస్తున్నారు. మరి కొందరు దీపికా పదుకొనెను ప్రశంసిస్తున్నారు.

దీపిక అభిమానులు సైతం కౌంటర్ గా ట్వీట్స్ చేస్తున్నారు. ‘నాకు దేశమే ముఖ్యం. ఆ తర్వాతే నా ఫేవరెట్‌ హీరోయిన్‌ అయినా.. మరెవరైనా. దీపిక లాంటి సినిమా హీరోయిన్‌ కోసం కాకపోయినా.. నిజమైన హీరో లక్ష్మీ అగర్వాల్‌ కోసం ఛపాక్ సినిమా చూడాలి’ అని అంటున్నారు.

కాగా, జేఎన్ యూలో దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా పలు వర్సిటీలు, విద్యాసంస్థల్లో ప్రదర్శనలు జరిగాయి. దాడికి పాల్పడినవారికి సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అటు తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో జేఎన్ యూ వైస్ చాన్సలర్ జగదీశ్ కుమార్ భేటీ అయ్యారు. క్యాంపస్ లో సుహృద్భావ వాతావరణం నెలకొల్పేలా ప్రొఫెసర్లు, విద్యార్థులతో మాట్లాడాలని అధికారులు సూచించారు.

సుమారు 50 మంది ముసుగు ధరించిన వ్యక్తులు రాడ్లు, కర్రలు, హాకీ స్టిక్స్ తో ఆదివారం(జనవరి 5,2020) రాత్రి ఢిల్లీలోని JNU క్యాంపస్ లోకి చొరబడి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.  దేశ్ కీ గద్దారో కో, గోలీ మారో సాలా కో అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ లేడీస్ హాస్టల్స్ కి కూడా దూరి విద్యార్థినులపై దాడిచేశారు. యావత్తు దేశం జేఎన్ యూ ఘటనను ఖండిస్తోంది. ఈ దాడికి పాల్పడింది ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ వాళ్లేనన్న ఆరోపణలూ ఉన్నాయి. 

Also Read : హక్కులు కాలరాసే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలి : హిందువులపై సానుభూతి చూపాల్సిందే