Rajnath Singh : రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్

స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్ నాథ్ సింగ్ బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Rajnath Singh : రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్

Rajnath Singh

Rajnath Singh : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు.  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాజ్ నాథ్ సింగ్ హోం క్వారంటైన్ లో ఉన్నారు. అయితే ఆయన గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సివుంది.

కాగా, కరోనా టెస్టులో పాజిటివ్ గా తేలడంతో ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్ నాథ్ సింగ్ బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Covid- 19 Cases: ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పాజిటివ్ కేసులు.. కేంద్రం కీలక నిర్ణయం

గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,591 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 40 మంది మృతి చెందారు. బుధవారం నమోదైన కేసులతో పోల్చితే 20 శాతం పాజిటివ్ కేసులు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 65,283 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4.47 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 5.31లక్షల మంది మృతి చెందారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతంగా ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.