Covid Positive : రాజ్‌‌నాథ్ సింగ్‌‌కు కరోనా

.కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని...

Covid Positive : రాజ్‌‌నాథ్ సింగ్‌‌కు కరోనా

rajanath

Defence Minister Rajnath Singh : కరోనా ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం ఈ దిక్కుమాలిన వైరస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. నేతలకు కూడా ఈ వైరస్ సోకుతోంది. తాజాగా..కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. 70 సంవత్సరాలున్న రాజ్ నాథ్ సింగ్..జనవరి 06వ తేదీ గురువారం ఉత్తర కాశీ రీజియన్ లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ లో త్వరలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…బీజేపీ అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.

Read More : The Plated project : ’ఆకలి తీర్చే యజ్ఞం’..‘ఈ ప్లేటు కొనండి..పేదపిల్లల కడుపు నింపండీ..

భారత్‌లో కరోనా జోరు కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే లక్షా 79 వేల కేసులు నమోదయ్యాయి. అంతకముందు రోజుతో పోల్చితే 13శాతం కేసులు పెరుగుదల నమోదైంది. ఇక ఈ ఏడు రోజుల్లో కరోనా వీరవిహారం చేసింది. ఈ ఒక్క వారంలోనే దేశంలో దాదాపు 7లక్షల 80 వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అంతకముందు వారంలో లక్షా 30 వేల కేసులు నమోదయ్యాయి. అంటే ఈ ఏడు రోజుల్లో ఆరు రెట్ల కేసుల పెరుగుదల రికార్డయింది. అటు ఈ నెల అఖరి వారంలో కరోనా థర్డ్‌వేవ్‌ పీక్స్‌కు వెళుతుందని చెబుతున్నారు సైంటిస్టులు. ఢిల్లీ, ముంబైలలో కరోనా కేసుల కల్లోలం ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో రోజుకు 50 నుంచి 60 వేల కేసులు, ముంబైలో రోజుకు 30 వేల కేసులు నమోదవుతాయని అధ్యయనలు చెబుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరిగినా ఆస్పత్రుల చేరిక తక్కువే ఉంటుందని సైంటిస్టులు చెబుతుండడం బిగ్‌ రిలీఫ్‌.

Read More :
 Delhi Police Corona : కరోనా టెర్రర్.. ఒకేసారి వెయ్యి మంది పోలీసులకు కోవిడ్

అటు ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 20వేలు దాటింది. ఢిల్లీలో కొత్తగా 22వేల 751 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇటు పాజిటివిటీ రేటు 23 శాతానికి పెరిగింది. గత ఏడాది మే ఒకటి తర్వాత ఢిల్లీలో ఈ తరహా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో కొవిడ్‌ పరిస్థితిపై ఇవాళ ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ మరోసారి సమావేశం కానుంది. అటు మహరాష్ట్రలోనూ కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. అక్కడ రోజువారీ కేసుల సంఖ్య 44వేలు దాటింది. ఒక్క ముంబైలోనే దాదాపు 20 వేల కేసుల రికార్డయ్యాయి. అటు మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2లక్షలు దాటేసింది. ఇక ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల ప్రవాహం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 207 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 12 వందలు దాటింది.