లాక్‌డౌన్ దేవుడికే.. బెంగాల్‌లో బారులు తీరిన భక్తులు

లాక్‌డౌన్ దేవుడికే.. బెంగాల్‌లో బారులు తీరిన భక్తులు

కరోనా మహమ్మారిపై పోరాడదాం ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిస్తుంటే.. ఏదో వంకతో రోడ్డెక్కే ఆకతాయిలు లాక్ డౌన్ ను బ్రేక్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు భక్తి పేరిట ప్రజలు గుమిగూడటం మానడమే లేదు. ఢిల్లీలోని మర్కజ్ బిల్డింగ్ లో జమాత్ పేరిట పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట గడిపారు. వారిలో దాదాపు 9000మందికి పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఇది జరుగుతూనే ఉన్నా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు బెంగాల్ వాసులు. 

రామ నవమి పండుగ సందర్భంగా  గుడి మూసేసి ఉన్నప్పటికీ భక్తులు మాత్రం లాక్ డౌన్ పాటించలేదు. గుడికి గ్రూపులుగా చేరుకుని.. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మహమ్మారిని విస్మరించారు. ఏ ఒక్క ప్రాంతంలో మాత్రమే కాదు.. జిల్లాల వారీగా గుడుల ఎదుట వందల సంఖ్యలో కనిపించారు. బెలియఘట, మణక్తాలా ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. చేసేదేం లేక కోల్‌కతా పోలీసులు కనీసం సామాజిక దూరమైనా పాటించాలంటూ సూచనలు జారీ చేశారు. గుడిలోకి ఒక్క అడుగు వేయడానికి కూడా వీలులేదని ఆంక్షలు పెట్టారు. 

మరి కొన్ని చోట్ల సామాజిక దూరం పాటిస్తూ క్యూ పద్ధతిలో గుడి ప్రాంగణంలోకి అనుమతించారు. లాక్‌డౌన్ ఉల్లంఘించినందుకు కొన్ని ప్రాంతాల్లో వాహనాలపైన పోలీసుల దాడులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీసులపైకి ఎదురుదాడికి దిగడంతో పోలీసులకు గాయాలై హాస్పిటల్లో చేరారు. ఆహార పదార్థాలు సరఫరా చేయడం లేదనే నెపంతో బిర్‌భమ్ జిల్లాలోని రేషన్ షాప్ డీలర్ ను కూడా గ్రామస్థులు కొట్టారు. 

Also Read | జూన్ 1న స్కూళ్లు ప్రారంభమయ్యేనా ? 10వ తరగతి పరీక్షలు అనుమానమే