Dehradun Social worker : కరోనాతో అనాథలైన 100మంది చిన్నారులకు ‘JOY’ అండ..

కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన పిల్లలను దత్తత తీసుకోవటానికి ముందుకొచ్చారు జాయ్ సంస్థ వ్యవస్థాపకులు జైశర్మ. డెహ్రాడూన్ కు చెందిన ఈ సంస్థ ఇప్పటికే 20మంది పిల్లలను దత్తత తీసుకుంది.మరో 80మంది పిల్లలను దత్తత తీసుకోనుంది.

Dehradun Social worker : కరోనాతో అనాథలైన 100మంది చిన్నారులకు ‘JOY’ అండ..

Dehradun Social Worker Jai Sharma

Dehradun Social worker Jai Sharma : కరోనా మహమ్మారిని ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఎంతోమంది చిన్నారుల్ని అనాథల్ని చేసింది. కరోనా సోకి తల్లిదండ్రులు చనిపోగా ఎంతోమంది పిల్లలు అనాథలైపోయారు. వీరికి అండగా ఉంటామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినా అది ఎంతవరకూ సాధ్యమవుతుంది? అది ఎప్పటికి అవుతుంది? అనేది ప్రశ్నార్థకమే. ఈక్రమంలో వీరికి నేనున్నానంటూ భరోసానిచ్చారు డెహ్రాన్ డూన్ లోని ఓ సామాజిక కార్యకర్త జై శర్మ.

కరోనా బారినపడి దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. కుటుంబ సభ్యులను, స్నేహితులను, సన్నిహితులను, పిల్లలు అమ్మానాన్నలను..తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోయారు. కరోనా మహమ్మారిని ఎన్నో కుటుంబాలను అల్లకల్లోలంచేసేసింది. ముఖ్యంగా వేలాదిమంది చిన్నారులు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు. అలా అనాథలుగా మారిన చిన్నారులను దత్తత తీసుకుని వారిని బాగోగులు చూసేందుకు ముందుకొచ్చారు డెహ్రాన్ డూన్ లోని ఓ సామాజిక కార్యకర్త జై శర్మ. ఇప్పటికే 20మంది పిల్లలను దత్తత తీసుకన్న శర్మ ఇప్పుడు మరో 80మంది పిల్లలను దత్తత తీసుకోవటానికి రెడీ అయ్యారు.

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని సామజిక కార్యకర్త జై శర్మ. ఆయనకు చెందిన జాయ్ సంస్థ (జస్ట్ ఓపెన్ యువర్ సెల్ఫ్) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు శర్మ. ఈ సంస్థ చిన్నారుల కోసం ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఈ సంస్థ ఇప్పటికే 20 మంది దత్తత తీసుకుంది. మరో 80మంది అనాథ చిన్నారులను దత్తత తీసుకోవడానికి సిద్దపడుతోంది. డుతుంది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఇప్పటికే కరోనావల్ల తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలున్న కొన్ని కుటుంబాలను గుర్తించిందీ సంస్థ. తల్లిదండ్రుల కరోనాతో మరణించడంతో ఆ చిన్నారులు అనాథలగా మారారు..ఆ చిన్నారుల్ని చూస్తే ఎంతో బాధ కలిగిందని.. ఆ పిల్లలను చేరదీసి.. అండగా నిలబడాలని నిర్ణయించుకున్నామని సంస్థ వెల్లడించింది. ఇప్పటికే తమ సంస్థ ద్వారా 20 మంది పిల్లలని దత్తత తీసుకున్నామని.. వారందరికీ తిండి, వసతి, అవసరమైనవారికి వైద్యం ఇలా అన్నీ చూసుకుంటున్నామని తెలిపారు జై శర్మ.

ప్రస్తుతానికి 20మంది పిల్లలున్నారని.. మరో వారంలో 50 మంది పిల్లల్ని జాయ్ కు తీసకొస్తామని తెలిపారు. ప్రస్తుతానికి 100 మంది పిల్లలను చేరదీయాలని నిర్ణయించామని జాయ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ​కరోనా సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలతో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

జాయ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రోజూ కొన్ని గ్రామాలను సందర్శించి కరోనాతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు ఉంటే వారిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే జై శర్మ ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఆక్సిజన్​ను సైతం ఎన్జీవో తరఫున అందించారు. అలాగే ఎన్జీవో బృందాలు.. కొవిడ్ మెడికల్ కిట్లు, శానిటైజేషన్ కిట్లు, అవసరమైన వారికి వైద్య సాయం చేశాయి. ఈ విషయాలన్నింటినీ జై శర్మ ఫేస్​బుక్​లో ద్వారా తెలిపారు. జై శర్మ చేస్తున్న పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయం చేయాలంటే కముందుగా కావాల్సింది మంచి మనసు అని అది జై శర్మ కు ఉందని అంటున్నారు.