Delhi Liquor Scam: విచారణకు హాజరుకాలేనన్న సిసోడియా.. సరేనన్న సీబీఐ

సిసోడియాపై 120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీతి లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా లేదా వ్యక్తిగత ప్రభావంతో ప్రభుత్వ ఉద్యోగిని ప్రభావితం చేయడానికి అనవసర ప్రయోజనాలను పొందడం వంటి వాటి మీద కేసులు వేశారు

Delhi Liquor Scam: విచారణకు హాజరుకాలేనన్న సిసోడియా.. సరేనన్న సీబీఐ

Delay liquor case questioning as I've to prepare Budget: Sisodia to CBI

Delhi Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో ఆదివారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా హాజరు కావాల్సి ఉంది. అయితే తాను ఈరోజు హాజరు కాలేనని, హజరు కొరకు తనకు మరికొద్ది రోజులు గడువు కావాలంటూ ఆయన చేసిన విజ్ణప్తి సీబీఐ అంగీకరించింది. తానెప్పుడూ ప్రభుత్వ సంస్థల దర్యాప్తు సహకరిస్తానని శనివారం ప్రకటించిన సిసోడియా, ఆదివారం ఇలా ఉన్నట్టుండి హాజరు కాలేకపోతున్నానని చెప్పడం వెనుక ఒక కారణం ఉంది. ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న సిసోడియా, ప్రస్తుతం ఢిల్లీ బడ్జెట్ కూర్పులో ఉన్నారట. ప్రజా సంబంధమైన పాలసీలు రూపొందిస్తున్నందున తనకు సీబీఐ హాజరు నుంచి మినహాయింపు కావాలని కోరారు.

Asaduddin Owaisi: అయితే నన్ను చంపుతారా?.. కర్ణాటక సీఎం బొమ్మైకి అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న

ఫిబ్రవరి చివర్లో కానీ, మార్చి ప్రారంభంలో కానీ తానే స్వయంగా సీబీఐ కార్యాలయానికి వస్తానని సిసోడియా పేర్కొన్నారు. ఆ సమయంలో సీబీఐ తనను ఎప్పుడు పిలిచినా సహకరిస్తానని ఆయన ప్రకటించారు. ఈ కేసు విషయంలో గతంలో పలుమార్లు విచారణ ఎదుర్కొన్న సిసోడియాకు శనివారం మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనను సీబీఐ ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి పిలిపించిందని తన ట్విట్టర్ ఖాతాలో శనివారం వెల్లడించారు.

Maharashtra: తన వెనకాల అమిత్ షా ఉన్నారట.. సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు

సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం.. మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా లభించిన తాజా సాక్ష్యాధారాల ఆధారంగా రేపు విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవినీతికి జరిగిందంటూ లిక్కర్ స్కాం పైకి లేచిన విషయం తెలిసిందే. ఇక సిసోడియాపై 120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీతి లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా లేదా వ్యక్తిగత ప్రభావంతో ప్రభుత్వ ఉద్యోగిని ప్రభావితం చేయడానికి అనవసర ప్రయోజనాలను పొందడం వంటి వాటి మీద కేసులు వేశారు. మద్యం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేయాలనే ఢిల్లీ ప్రభుత్వ విధానం.. అందుకు లంచాలు చెల్లించినట్లు కొంతమంది డీలర్ల ఆరోపణలకు అనుకూలంగా ఉందని సీబీఐ ఆరోపించింది. అయితే సీబీఐ చేస్తున్న ఆరోపణల్ని ఆప్ తీవ్రంగా ఖండించింది.