విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం : సీఎం కేజ్రీవాల్ ఎమర్జన్సీ మీటింగ్

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 06:26 AM IST
విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం : సీఎం కేజ్రీవాల్ ఎమర్జన్సీ మీటింగ్

జెఎన్‌యులో హింసాకాండపై సీఎం అరవింద్ కేజ్రీవాల్  ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలోనే విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ వారి సురక్షితంగా ఉండగలరు అని ప్రశ్నించారు. విద్యార్ధులపై దాడులు చేస్తుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని  ఆయన ఆవేదనగా  ప్రశ్నించారు. జేఎన్ యూలో జరిగిన విద్యార్దులు..లెక్చరర్లపై జరిగిన దాడికి సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు.  

సీఎం కేజ్రీవాల్ జెఎన్‌యులో హింస గురించి వింటుంటూ చాలా ఆశ్చర్యంగా ఉందని ట్వీట్ చేశారు. విద్యార్థులపై దారుణంగా దుండగులు తీవ్రంగా దాడి చేశారనీ పోలీసులు దీనిపై ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు వెంటనే వర్శిటీలో హింసను ఆపి శాంతిని పునరుద్ధరించాలని అన్నారు. జేఎన్‌యు క్యాంపస్‌లో హింస ఘటనపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మంత్రులు పాల్గొన్నారు. 

కాగా..JNUలో ఆదివారం (జనవరి 5,2020)రాత్రి యునివర్సిటీలోకి చొరబడిన దుండగలు స్టూడెంట్స్‌ పైనా..లెక్సరర్లపైనా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జేఎన్​యూ ఎస్​యూ​ ప్రెసిడెంట్ అయిషీ ఘోష్​, ప్రొఫెసర్లతో పాటు కనీసం 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు..పలు కార్లు, బైకులను దుండగులు ధ్వంసం చేశారు. నానా బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లతో వర్శిటీలోకి ప్రవేశించిన దుండగులు కనిపించినవారిపై దాడులకు పాల్పడుతున్నారు. విధ్యంసం సృష్టించారు. దీంతో జేఎన్​యూలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ గేటు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసింది.