త్వరలో విమాన సర్వీసులు…ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో UV డిసిన్ఫెక్షన్ టెక్నాలజీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 10:12 AM IST
త్వరలో విమాన సర్వీసులు…ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో UV డిసిన్ఫెక్షన్ టెక్నాలజీ

ప్యాసింజర్ రైళ్లను సోమవారం నుంచి పాక్షికంగా ప్రారంభించనున్నట్లు ఆదివారం ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీని కిక్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయింది. మే-15లోగా దేశీయ విమానసర్వీసులు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు ఇప్పటికే పౌరవిమానయానశాఖ చెప్పిన విషయం తెలిసిందే. డీజీసీఏ,సీఐఎస్ఎఫ్,AAI,DIAL అధికారులతో సహా ఎయిర్ పోర్ట్ అధికారులతో కూడిన ఓ ఉన్నతస్థాయి కమిటీ ఇవాళ(మే-11,2020)తర్వలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసుల పునరుద్దరణ కోసం సంసిద్దతలను పరిశీలించింది.

లాక్ డౌన్ తర్వాత ఎకానమీని పరుగులు పెట్టేందుకు తీసుకుంటున్న ఒక బలమైన సూచికగా ఈ చర్య కనిపిస్తోంది. అయితే మే-15లోగా దేశీయ విమానసర్వీసులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పినప్పటికీ…ఎంపికచేసిన సిటీలకు విమానసర్వీసులు మూడో దశ లాక్ డౌన్ ముగిసిన తర్వాతనే ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.

అయితే మరికొన్ని వారాలపాటు అంతర్జాతీయ విమానసర్వీసులు ఆగిపోనున్నట్లు డీజీసీఏ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు,  కరోనా వైరస్ ను ఎదుర్కోవటానికి ఉపరితలాలను డిసిన్ఫెక్షన్(క్రిమిసంహారం)చేయడానికి అతినీలలోహిత (UV) కిరణాలను మోహరించే మొబైల్ టవర్లు, హ్యాండ్‌హెల్డ్ టార్చ్ మరియు సామాను సొరంగాలను(baggage tunnels)ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఉపయోగిస్తున్నట్లు DIAL సోమవారం తెలిపింది. మొబైల్ టవర్లను టెర్మినల్ యొక్క కార్డన్డ్ ప్రదేశాలలో ఉంచారు. వాటిలోని యువి కిరణాలు క్రిమిసంహారకం(డిస్ ఇన్ఫెక్షన్) కోసం ఉపయోగిస్తారని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (DIAL) ఒక ప్రకటనలో తెలిపింది.

మనుషులు ధరించే షూస్ కూడా కరోనా వైరస్ ను క్యారీ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి కాబట్టి..వ్యూహాత్మక ప్లేస్ లలో షూ శానిటైజర్ మ్యాట్ లను సిద్దంగా ఉంచినట్లు డీఐఏఎల్ తెలిపింది. ప్యాజింబర్ల వాష్ రూమ్ లలో సెన్సార్ ఆధారిత ట్యాప్ లు, ఫుట్ ఆపరేటెడ్ శానిటైజర్ డిస్పెన్సర్, సెన్సార్ ఆధారిత మరియు పెడల్ ఆపరేటెట్ తాగునీరు ఫౌంటెయిన్ ను కాంటాక్ట్ లెస్ ఉపయోగకం ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

కాగా,తాము ఎయిర్ పోర్ట్ ను ఆపరేట్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ DGM-ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గౌరాంగ్ నత్వానీ తెలిపారు. కరోనా వారియర్స్ కు సపరేట్ క్యూ ఉంటుందని,దీనివల్ల మిగతా ప్రయాణికులతో పాటు వాళ్లు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిరోజూ ఎయిర్ పోర్ట్ శానిటైజేషన్ చేస్తున్నామన్నారు.

కరోనా నేపథ్యంలో మే-25నుంచి భారత్ లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ దేవవ్యాప్తంగా ఇప్పటివరకు 67వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, 2వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. లాక్ డౌన్ కారణంగా కార్గో విమానాలు,విదేశాల్లో చిక్కుకున్న వారిని తరలించే విమానాలు,వైద్య పరికరాలను తరలించే విమానాలు,డీజీసీఏ ఆమోదం తెలిపిన ప్రత్యేక విమానాలు తప్ప మిగిలిన్న అన్ని కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్ లు నేలపైనే ఉండిపోయిన విషయం తెలిసిందే.