200 మంది కరోనా రోగులకు అంత్యక్రియలు చేశాడు..వైరస్ తో చనిపోయాడు..ఆర్నెళ్లు ఇంటికి దూరంగా

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 08:20 AM IST
200 మంది కరోనా రోగులకు అంత్యక్రియలు చేశాడు..వైరస్ తో చనిపోయాడు..ఆర్నెళ్లు ఇంటికి దూరంగా

delhi ambulance driver : తనకు విధులే ముఖ్యమని భావించాడు. ఆర్నెళ్లు ఇంటికి దూరంగా ఉన్నాడు. కరోనా రోగులు చనిపోతే..దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించేవాడు. చాలా మంది రోగుల కుటుంబసభ్యులు రాకపోతే..అతనే అంత్యక్రియలు నిర్వహించేవాడు. ఇంత మేలు చేసిన ఆ డ్రైవర్ ను వైరస్ కబళించి వేసింది. చికిత్స పొందుతూ కన్నుమూశాడు.



ఆరు నెలలుగా అతడి మొహం చూడని కుటుంబసభ్యులు చివరి చూపునకు కూడా నోచుకోకుండా..దూరం నుంచే అంత్యక్రియలను చూడాల్సి వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆరీఫ్ ఖాన్ (48) 25 ఏళ్లుగా అంబులెన్స్ డ్రైవర్ గా Shaheed Bhagat Singh Sewa Dal పనిచేసేవాడు. ఈశాన్య ఢిల్లీలోని శీలంపూర్ లో నివాసం ఉంటున్నాడు. భార్య, పిల్లలున్నారు. మార్చి నెల నుంచి కరోనా వైరస్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే.



వైరస్ బారిన పడి పిట్టల్లా చనిపోతున్నారు. వైరస్ సోకిన వారిని ఆసుపత్రికి తరలించడం ఆరీఫ్ ఖాన్ చేసేవాడు. సమయం చూసుకోకుండా..విధులు నిర్వహించేవాడు. ఇలా ఆరు నెలలుగా అంబులెన్స్ ను హాస్పటిల్ లోనే పార్క్ చేసి అందులోనే నిద్రపోయేవాడు.



వైరస్ కారణంగా చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేవాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా సహాయం చేసేవాడు. కేవలం ఫోన్ లోనే కుటుంబసభ్యులు మాట్లాడేవారు. జాగ్రత్తగా ఉండాలని సూచించేవారు. అక్టోబర్ 03వ తేదీన అస్వస్థతకు గురయ్యేవాడు. కరోనా పరీక్షలు చేయగా..నెగటివ్ వచ్చింది. ఆరోగ్యం మరింత క్షీణిస్తూ…చనిపోయాడు.



సాయం చేయడంలో ఆరీఫ్ ఎప్పుడు ముందుండే వారని మిత్రుడు జితేందర్ చెప్పాడు. కానీ..చనిపోయిన తర్వాత..అంత్యక్రియలు అలా జరగలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంతో సహాయం చేసిన ఆరీఫ్ చివరి కార్యక్రమాన్ని కుటుంబసభ్యులు దూరం నుంచే చూడాల్సి వచ్చింది. నాన్న లేకుండా..ఎలా బతకగలం ? అంటున్నారు కుమారులు.



ప్రమాదకరమైన పరిస్థితులున్నా..సాయం చేయడానికి ముందుండేవారని ఆవేదనతో తెలిపారు. ఆరీఫ్ చనిపోవడంతో అతనితో పని చేసిన వారు, ఇతరులు కన్నీరుమున్నీరవుతున్నారు.