ICMR : జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే మార్చి 11 తర్వాత సమూహ వ్యాప్తి తప్పదు!

కరోనా వైరస్ పలు స్టేజీలలో ఉంటుందని తెలిపారు. కరోనా కట్టటి కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొన్ని జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే...

ICMR : జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే మార్చి 11 తర్వాత సమూహ వ్యాప్తి తప్పదు!

Icmr

ICMR: దేశంలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆ రెండు చోట్ల థర్డ్ వేవ్ పీక్‌కి చేరిందని ఐసీఎంఆర్ వ్యాధుల విభాగం హెడ్‌ డాక్టర్ సమీరన్ పాండా అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబైల్లో సిచుయేషన్ చెప్పేందుకు మరో రెండు వారాలు ఆగాల్సి ఉంటుందని చెప్పారు. పీక్‌కి చేరిందా.. పరిస్థితి చేయి దాటిందా అనే అంశాలను ఇప్పుడే చెప్పలేమన్నారాయన. మరికొద్ది రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత లేదని చెప్పారు. కానీ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు.

Read More : TTD : ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీయాగం

కేసుల గురించి కానీ.. పాజిటివిటీ రేటు గురించి లెక్కగట్టలేమని పేర్కొన్నారు. ఆ రెండు చోట్ల ఒమిక్రాన్ 80 శాతం, డెల్టా 20 శాతం కేసులు ఉండొచ్చని చెప్పారు డాక్టర్‌ సమీరన్‌. అంతేకాదు దేశంలో వివిధ ప్రదేశాల్లో కరోనా వైరస్ పలు స్టేజీలలో ఉంటుందని తెలిపారు. కరోనా కట్టటి కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొన్ని జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే మార్చి 11 తర్వాత సముహ వ్యాప్తి తప్పదని హెచ్చరించారు. ఇటు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా ముగిసిపోలేదని తెలిపింది. రాబోయే రోజుల్లో కొతత్ రకాలు ఉద్భవించే అవకాశముందని హెచ్చరించారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌.