Delhi election 2020: బీజేపీ పూజలు ఫలించేలా లేవు..

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 06:51 AM IST
Delhi election 2020: బీజేపీ పూజలు ఫలించేలా లేవు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ బీజేపీ ఆశను అడియాసలు అవుతున్నాయి. కాషాదళం కంగారుపడుతోంది.  ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా క్రమంలో  బీజేపీ విజయం సాధించాలని ఇప్పటికే బీజేపీ నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఢిల్లీ పీఠం దక్కాలని గంపెడాశలు పెట్టుకున్న బీజేపీ కలలు ఫలించే అవకాశాలు ఎక్కడా కనిపించటంలేదు. చీపురు కమలాన్ని ఎక్కడిక్కడ ఊడ్చి పారేజీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 57 స్ధానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్న ఆప్ పార్టీని కాషాయదళం అందుకోలేకపోతోంది. 

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను..ఆమ్ ఆద్మీ పార్టీ ..మెజారిటీ మార్క్ 36ను దాటి 57 స్థానాలకు పైగా ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ మాత్రం గతకంటే కాస్త పుంజుకున్నా..ఆప్ ను మాత్రం అందుకునే పరిస్థితి లేదు.  దీంతో గెలుపు సాధించాలనే ఆకాంక్షతో బీజేపీ అగ్రనేతలు సైతం ఢిల్లీలో ప్రచారం చేశారు. కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ఉగ్రవాదిలాంటివారనీ తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం కేజ్రీవాల్ కే మారోసారి పట్టం కట్టనున్నట్లుగా తెలుస్తోంది. 

కాగా ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయం కోసం బీజేపీ నేత  విజయ్ గోయల్ ఉదయాన్నే కన్నావుఘాట్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయ్ గోయల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉందన్నారు. కానీ బీజేపీ ఆశలు ఫలించే అవకాశాలు మాత్రం కనుచూపు మేరలో లేదు. మెజారిటీ మార్క్ 36ను దాటేసిన ఆప్  57 స్థానాలకు పైగా ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది.