కరోనా వ్యాప్తి ఇస్లాం,ముస్లింలకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర : తబ్లిగీ జమాత్ చీఫ్ ఆడియో టేపుల కలకలం!

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2020 / 01:33 PM IST
కరోనా వ్యాప్తి ఇస్లాం,ముస్లింలకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర : తబ్లిగీ జమాత్ చీఫ్ ఆడియో టేపుల కలకలం!

దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ తగ్లిబీ జమాత్ కార్యక్రమానికి సంబంధించినది అంటూ ఇప్పుడు సోషల్ మీడియో వైరల్ అవుతున్న ఓ ఆడియో క్లిప్ విని ఇప్పుడు అధికారులు స్టన్ అవుతున్నారు. మర్కజ్ తబ్లిగీ జమాత్  హెడ్… మొహమ్మద్ సాద్ ఖాందావలి వాయిస్ గా చెప్పబడుతున్న ఆ ఆడియో క్లిప్ లో…సోషల్ డిస్టెస్(సామాజిక దూరం)అవసరమే లేదు. మన మతంలో ఎక్కడా దీని గురించి చెప్పలేదు అని మాట్లాడినట్లు ఉంది. అంతేకాకుండా విశ్వాసులను మసీదులకు రాకుండా నిరోధించడానికి కరోనా వైరస్ వ్యాప్తి అనేది ముస్లింలకు,ఇస్లాంకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని మొహమ్మద్ సాద్ ఖాందావలి వాయిస్ గా చెప్పబడుతున్న చెబుతున్న మరో ఆడియో క్లిప్ లలో వాయిస్ ఉంది. 

అయితే సాద్ కు దగ్గరగా ఉండే కొందరు వ్యక్తులు మాత్రం ఇది ఖాందావలి వాయిసే అని నమ్ముతున్నారు. ఆ ఆడియో క్లిప్ లో కొందరు దగ్గుతున్నట్లుగా,తమ్ముతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. ఈ క్లిప్ ఇప్పుడు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ వరకు చేరింది. అయితే ఈ ఆడియో క్లిప్ విషయమై కొందరు మీడియా మిత్రులు జమాత్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి మొహమ్మద్ అష్రప్ ని సంప్రదించారు. మొహమ్మద్ అష్రఫ్ మాట్లాడుతూ… పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో సాద్‌తో పాటు మార్చి 23-24 తేదీలలో నిజాముద్దీన్ SHOని కలవడానికి వెళ్లిన వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పాడు. అయితే ఏ తప్పు చేయకపోయినట్లే..సాద్ ఎందుకు పారారీలో ఉన్నాడన్న ప్రశ్నకు సమాధానంగా….వారంరోజుల క్రితం నేను ఆయనను కలిశాను. అప్పటినుంచి ఆయనను కలవడం కానీ,ఆయనతో మాట్లాడటం కానీ చేయలేదు. సాద్ తన బంధువుల దగ్గర ఉండే అవకాశముంది లేదా తిరిగి ఖందాల్ వెళ్లిపోయి ఉండవచ్చని మొహమ్మద్ అష్రఫ్ తెలిపాడు.

ప్రస్తుతం WWW.delhimarkaz.comలో నుంచి తొలగించిబడిన కొన్ని ఆడియో క్లిప్ ల టైటిల్స్…జబ్ పోలీస్ వాలా మర్కజ్ మయి ముసాఫా కర్నే సే మానా కర్నే ఆయా(మనల్ని హ్యాండ్‌షేక్ చేయకుండా ఆపడానికి పోలీసులు వచ్చినప్పుడు),బీమారీ తో ఏక్ బహానా హై(వ్యాధి ఒక సాకు),బిమారీ హజ్ బి చుడ్ వాయేగి(యాత్ర చేయకుండా మనల్ని వ్యాధి అడ్డుకుంటుంది),చోనీ సే నహీ ఇజ్ వాజహ్ సే ఫెల్తీ హై యే బిమారీ(టచ్ చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందదు,కానీ ఈ కారణం కోసం) ఇలా ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఇందులోని ఓ ఆడియో క్లిప్ మాత్రం ఆ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఆ ఆడియోక్లిప్ లో ప్రచారకుడు మాట్లాడుతూ….మంచికో,చెడుకో అన్ని వర్క్స్ అల్లాహ్ ద్వారా చేయబడినవి. అల్లా రక్షకుడు మరియు నాశనం చేసేవాడు. ముస్లింలు ప్రేయర్,నమాజ్ చేయడం మరియు మసీదుకు వెళ్లడం ఆపకూడదు. మీరు అలా ఆపేస్తే…అల్లాహ్ మిమ్మల్ని ఎక్కువ శిక్షిస్తాడు. ప్రస్తుతం, అల్లాహ్ ప్రతి ఒక్కరిపై కోపంగా ఉన్నాడు, అల్లాహ్ కోపాన్ని అంతం చేయడానికి, మనమందరం మసీదుకు వెళ్లి జాగ్రత్తలతో ప్రార్థించాలి. ముసల్మానో  కె అందర్ కరోనా కా ఖౌఫ్’ (ముస్లింలలో కరోనావైరస్ భయం) అని ఉన్న మరో ఆడియో క్లిప్… మసీదును సందర్శించిన తర్వాత ఎవరైనా మరణిస్తే, ఇంతకన్నా మంచిది ఏది ఉంటుంది. దేవుడు సేవ చేస్తున్నప్పుడు చనిపోయే మంచి ప్రదేశం ఇది అన్నట్లుగా ఉంది.

అయితే ఈ వెబ్‌సైట్(WWW.delhimarkaz.com) జమాత్ యొక్క అధికారిక పోర్టల్ కాదని మార్కాజ్ కమిటీ సభ్యుడు మరియు వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముష్రఫ్ అలీ ఖాన్ అన్నారు. ఇది ప్రామాణికమైన వెబ్‌సైట్ కాదు. పలువురు వ్యక్తులు ఆడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తారు. ప్రజలు మార్కాజ్ వద్దకు వస్తారు మరియు కొందరు ప్రసంగాలను రికార్డ్ చేస్తారు. ఈ వీడియోలు నకిలీవి అయి ఉండవచ్చు మరియు వివాదాలను సృష్టించే అవకాశముందని అలీ ఖాన్ అన్నారు. వెబ్‌సైట్‌లో ఫేస్‌బుక్ పేజీ మరియు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉన్నాయి, వీటిని వేలాది మంది యూజర్లు సబ్ స్కైబ్ చేసి ఉన్నారు.

ప్రస్తుతం పరారీలో ఉన్న మర్కజ్ తబ్లిగీ జమాత్  హెడ్.. సాద్,అతని అనుచరుల కోసం ఢిల్లీ పోలీసులు వేట మొదలెట్టారు. చాలా ప్లేస్ లలో పోలీస్ టీమ్ లు రైడ్ లు నిర్వహించినప్పటకీ వాళ్లని ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు. ముజఫర్ నగర్(UP) పోలీసుల సహాయం కూడా తీసుకుని,ఖందాల్ కు ఓ టీమ్ ను పంపిచనున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మార్చి 23-24 తేదీలలో నిజాముద్దీన్ SHO ముఖేష్ వాలియా ద్వారా నోటీసును అందుకున్న ఐదుగురు వ్యక్తులు, మరియు మౌలానా సాద్ పై కేసు నమోదుచేయబడినట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కూడా వారిపై కేసులు నమోదయ్యాయి. మర్కజ్ నిర్వహకులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.