free food : హోం క్వారంటైన్ లో ఉన్నవాళ్లకు ఫ్రీగా ఆహారం అందిస్తున్న యువ వ్యాపారవేత్త

free food : హోం క్వారంటైన్ లో ఉన్నవాళ్లకు ఫ్రీగా ఆహారం అందిస్తున్న యువ వ్యాపారవేత్త

Business Man  Gives Free Food To The Quarantine Families

Business Man  gives free food to the quarantine families : కరోనా వన్..కరోనా టూ అన్నట్లుగా తయారైంది మహమ్మారి జనాల్ని చంపేస్తున్న దారుణ పరిస్థితులు చూస్తుంటే. సీజన్ వన్ లో భయపెట్టిన కరోనా ఇప్పుడు హడలెత్తిస్తోంది. ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లే దొరకని పరిస్థితి. ఆక్సిజన్ అందుబాటులో లేదు. ప్రాణవాయుడు బ్లాక్ మార్కెట్ లో అమ్ముడుపోతోంది. పేదల ప్రాణాలు నడిరోడ్డుపై విలవిల్లాడుతున్నాయి. ఈ దారుణ పరిస్థితుల్లో ఆస్పత్రి కంటే ఇల్లే పదిలం అనిపిస్తోంది. కరోనా సోకినవారు ఆస్పత్రికి వెళ్లేకంటే హోం క్వారంటైన్ లో కోలుకోవటం మంచిదని నిపుణులు కూడా పదే పదే చెబుతున్నారు. కానీ హోం క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితులు బైటకు రాలేరు. నిత్యవసర వస్తువులు తెచ్చుకోలేరు.

ఇటువంటివారికు కేవటం నామ మాత్రపు సహాయం అందించటం కాదు..వారికి రోజుకు రెండు పూటలా సమయానికి ఆహారాన్ని అందిస్తూ పెద్ద మనస్సు చాటుకుంటున్నాడో యువ వ్యాపారవేత్త. ఢిల్లీలోని బోరీవలీకి చెందిన రాజీవ్ సింఘల్ తన సేవాగుణాన్ని చాటుకుంటూ.. ప్రతీరోజూ తన ఇంటిలో ఆహారాన్ని తయారుచేసి హోం క్వారంటైన్ లో ఉన్నవారికి అందిస్తున్నారు. అలా రోజుకు 200 మందికి మధ్యాహ్నం, రాత్రి కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. వారికి ఇంకా ఏమేమి కావాలో అడిగి తెలుసుకుని మరీ వారి అవసరాల్ని తీరుస్తున్నారు రాజీవ్ సింఘాల్.

బట్టల వ్యాపారం చేసే రాజీవ్ సింఘల్… కరోనాతో బాధపడుతూ హోం క్వారంటైన్ లో ఉన్నవారి ఆకలిని తీరుస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో..ఎవరెవరు హోం క్వారంటైన్ లో ఉన్నారో వివరాలు సేకరించి వారికి రోజుకు రెండు పూటలా కడుపు నిండా చక్కటి ఆహారాన్ని అందిస్తున్నారు..ఒకప్పుడు హోం క్వారంటైన్ లో ఉండి కరోనానుంచి కోలుకున్న రాజీవ్ సింఘాల్. ఆ సమయంలో రాజీవ్ సమయానికి ఆహారం అందక చాలా బాధపడేవారట. కానీ తనలా మరెవ్వరూ బాధపడకూడదనే ఉద్ధేశ్యంతో ఇలా హోం క్వారంటైన్ లో ఉన్నవారికి ఆహారాన్ని అందించాలనుకున్నారు. అలా రోజుకు 200లమందికి ఆహారాన్ని అందిస్తు అన్నదాతగా మారారు.

ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ గత సంవత్సరం నాకు కరోనాబారిన పడ్డాను. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. మంచి భోజనం కోసం ఎదురు చూసేవాడిని…అయితే హోమ్ క్వారంటైన్‌లో ఉన్న అందరికీ మంచి భోజనం దొరకడం
కష్టమని అప్పుడు తెలిసింది. అందుకే నేను పడిన ఇబ్బంది ఎవ్వరూ పడకూడదని కరోనా సోకి హోం క్వారంటైన్ లో ఉన్న బాధితులకు ఉచితంగా ఆహారం ఇవ్వాలని అనుకుని ఇలా చేస్తున్నానని..200 మంది హోమ్ క్వారంటైన్ బాధితులకు ఆహారం సిద్ధం చేసి వారికి అందిస్తున్నానన్నారు. తెలిపారు రాజీవ్. వ్యాపారవేత్త అయిన రాజీవ్ సింఘాల్ దగ్గర పనిచేసే ఆశా భర్తియా మాట్లాడుతూ..అన్నం, పప్పు, రెండు రకాల కూరలు, అప్పడాలు, పచ్చళ్లు వండి వాటిని ప్యాక్ చేసి బాధితుల ఇంటికి ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు.