తగ్గిన డీజిల్ ధర..రూ. 8 తగ్గింపు

  • Published By: madhu ,Published On : July 30, 2020 / 02:43 PM IST
తగ్గిన డీజిల్ ధర..రూ. 8 తగ్గింపు

కరోనా వైరస్ ను కట్టడి చేసిన ఢిల్లీ ప్రభుత్వం..డీజిల్ వాహనదారులకు గుడ్ న్యూస్ వినిపించింది. దీనిపై ఉన్న వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు 2020, జులై 30వ తేదీ గురువారం సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు తమ క్యాబినెట్ నిర్ణయించడం జరిగిందన్నారు.

ప్రస్తుతం డీజిల్ పై 30 శాతం వ్యాట్ ఉంది. దీనిని 16.75 శాతానికి తగ్గిస్తామన్నారు. ఆప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల…ఢిల్లీలో లీటర్ డీజిల్ రూ. 82 ఉన్నది..కాస్త..రూ. 73.64కు తగ్గుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల..వాహన వినియోగదారులకు డీజిల్ పై లీటర్ కు రూ. 8.36 మేర ఆదా అవుతుందని ఆయన వివరించారు.

మరోవైపు…ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన జాబ్ పోర్టల్ కు విశేష స్పందన వస్తోందని, వారం రోజుల్లోనే..సుమారు 7 వేల 577 కంపెనీలు రిజిష్టర్ చేసుకున్నాయన్నారు. 2 లక్షల 04 వేల 785 ఉద్యోగాల కోసం ఆ సంస్థలు ఈ జాబ్ పోర్టల్ లో పేర్కొన్నాయన్నారు. ఉద్యోగాల కోసం 3 లక్షల 22 వేల 865 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు.

ఇక కరోన విషయానికి వస్తే…ఇప్పటి వరకు లక్షా 33 వేల 310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 18 వేల 633 మంది కోలుకున్నారు. 3 వేల 907 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 10 వేల 770 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.