Arvind Kejriwal: ప్రసంగిస్తూ.. అందరి ముందూ కన్నీరు కార్చిన కేజ్రీవాల్.. ఎందుకంటే?

ఓ కార్యక్రమంలో పలు విషయాలను గుర్తు చేసుకుంటూ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు.

Arvind Kejriwal: ప్రసంగిస్తూ.. అందరి ముందూ కన్నీరు కార్చిన కేజ్రీవాల్.. ఎందుకంటే?

Arvind Kejriwal

Arvind Kejriwal – Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందంటూ కన్నీరు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. లిక్కర్ స్కాం జరగలేదని, కక్ష సాధింపు కోసమే దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ తమను కేంద్ర సర్కారు వేధిస్తోందని కేజ్రీవాల్ మొదటి నుంచి అంటోన్న విషయం తెలిసిందే.

Arvind Kejriwal


Arvind Kejriwal

లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ వేసినా ఆయనకు ఊరట దక్కడం లేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి… శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిసోడియా భార్య, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. బెయిల్ పిటిషన్ పై విచారణ మళ్లీ జులై 4వ తేదీన జరగనుంది.

ఇవాళ, ఓ కార్యక్రమంలో ఈ విషయాలనే గుర్తు చేసుకుంటూ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం నీళ్లు తాగి మళ్లీ ప్రసంగించారు. మనీశ్ సిసోడియా విద్యా రంగంలో ఎనలేని కృషి చేశారని కేజ్రీవాల్ చెప్పారు. అటువంటి మంచి మనిషిపై కేసులు పెట్టారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. పలువురి నుంచి సీబీఐ ఇప్పటికే అనేక వివరాలు రాబట్టింది.

Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్