కేజ్రీవాల్ భార్యకు కరోనా..సెల్ఫ్ ఐసొలేషన్ లో ఢిల్లీ సీఎం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కేజ్రీవాల్ భార్యకు కరోనా..సెల్ఫ్ ఐసొలేషన్ లో ఢిల్లీ సీఎం

Sunita Kejriwal

Sunita Kejriwal ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆమె టెస్ట్ చేయించుకోగా.. మంగళవారం టెస్ట్ రిజల్ట్‌లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె డాక్టర్ల సూచనమేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక, భార్యకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ కావడంతో సీఎం కేజ్రీవాల్ స్వయంగా స్వీయ నిర్బంధంలోకి(self-isolation)వెళ్లిపోయారు.

ఇక,దేశ రాజధానిలో రెండో దశలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజుకు 25వేలకు పైగా కేసులతో నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ సర్కార్ ఢిల్లీలో ఆరు రోజుల(ఏప్రిల్-26వరకు) లాక్‌డౌన్ విధించిన విధించిన తెలిసిందే. ప్రజలంతా వీలైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసమే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేజ్రీవాల్ ప్రకటించారు. నిత్యావసరాలు, మెడికల్ సేవలు, ఫుడ్ సర్వీసెస్ కొనసాగుతాయని.. లాక్‌డౌన్ నుంచి ఈ సేవలకు మినహాయింపు ఉందని కేజ్రీవాల్ తెలిపారు. పెళ్లిళ్ల వంటి వేడుకలకు 50 మంది కంటే ఎక్కువగా హాజరవకూడదని, పెళ్లి వేడుక చేసుకునేవారికి ప్రత్యేకంగా పాసులు మంజూరు చేయనున్నట్లు సీఎం చెప్పారు.

అంతేకాకుండా, ఢిల్లీలో ఉన్న వలస కార్మికులకు కూడా సీఎం ఓ అభ్యర్థన చేశారు. చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. ఇది పరిమిత లాక్‌డౌన్ మాత్రమేనని, కేవలం ఆరు రోజులేనని సీఎం చెప్పారు. దయచేసి ఎవరూ ఢిల్లీ వదిలి వెళ్లవద్దని ఆయన కోరారు. ఈ లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన పరిస్థితి రాదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్న కేజ్రీవాల్, ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని వలస కార్మికులకు హామీ ఇచ్చారు. అయితే, సీఎం విజ్ణప్తి చేసినప్పటికీ లాక్ డౌన్ పొడిగిస్తారనే భయంతో చాలామంది వలసకార్మికులు ఢిల్లీ వదిలి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.