కరోనా భయం వద్దు…ఆరోగ్యంగా ఉన్నోళ్లు మాస్క్ ధరించనక్కర్లేదన్న కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : March 9, 2020 / 09:50 AM IST
కరోనా భయం వద్దు…ఆరోగ్యంగా ఉన్నోళ్లు మాస్క్ ధరించనక్కర్లేదన్న కేజ్రీవాల్

దేశరాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు,జాగ్రత్తలు వంటి పలు విషయాలపై ఇవాళ(మార్చి-9,2020)ఢిల్లీ సీఎం,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు అధికారులు కూడా హాజరయ్యారు.(ఇలాంటి శానిటైజర్లు కరోనా వైరస్‌ నుంచి కాపాడలేవు!)

సమావేశం అనంతరం కేంద్రమంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ….కరోనా పాజిటివ్ కేసులు కనుక పెరిగితే ఐసొలేషన్ వార్డులను సిద్ధం చేసే విషయమై,డాక్టర్ల అందుబాటు విషయం,క్వారంటైన్(దిగ్భందించడం)సౌకర్యాలు,కాంటాక్ట్ ట్రేసింగ్,ఇతర ముందు జగ్రత్త చర్యల గురించి ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడినట్లు హర్షవర్థన్ తెలిపారు. 

జనవరి-18,2020న దేశంలోని ఏడు ఎయిర్ పోర్ట్ లలో యూనివర్శల్ స్క్రీనింగ్ ప్రారంభించాం. ఇప్పుడు 30ఎయిర్ పోర్ట్ లలో స్క్రీనింగ్ జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ ఎయిర్ పోర్ట్ లలో స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 8లక్షల74వేల708మంది ప్యాసింజర్లు స్క్రీన్ చేయబడ్డారు. ఢిల్లీలో వైరస్ ను అరికట్టే విధంగా ఢిల్లీ ప్రభుత్వం,లెఫ్టినెంట్ గవర్నర్ అన్ని నివారాణ చర్యలు చేపట్టాలని కోరినట్లు ఆయన తెలిపారు. కరోనా విషయంపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపినట్లు మంత్రి తెలిపారు. గడిచిన 10-12రోజుల్లో 60దేశాలు కరోనా కేసులు నమోదైనట్లు తెలిపాయని హర్షవర్థన్ తెలిపారు.

సమావేశం అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ…ఢిల్లీ మెట్రో కోచ్ లు,డీటీసీ బస్సులు శానిటైజ్ చేయబడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43కి చేరింది. తల్లిదండ్రులతో కలిసి ఇటలీ వెళ్లి మార్చి-7న కేరళకు వచ్చిన ఓ చిన్నారికి కరోనా సోకినట్లు సోమవారం డాక్టర్లు తేల్చారు. జమ్మూకశ్మీర్ లో 63ఏళ్ల మహిళకు కూడా కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు.

కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు మార్చి-31వరకు క్రూయిజ్ షిప్ ల ప్రవేశంపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. అంతేకాకుండా ఇటలీ,ఇరాన్,చైనా వంటి కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల నుంచి మనదేశంలోకి టూరిస్టులు రాకుండా నిషేదాజ్ణలు విధించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలను కూడా కరోనా నేపథ్యంలో రద్దు చేసింది భారత ప్రభుత్వం.