CM Kejriwal:ఢిల్లీలో డాక్టర్ల ధర్నాపై ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారని పేర్కొన్నారు. వైద్యులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. డాక్టర్ల డిమాండ్లను ప్రధాని మోదీ అంగీకరించాలన్నారు.

CM Kejriwal:ఢిల్లీలో డాక్టర్ల ధర్నాపై ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

Kejrival

CM Kejriwal:దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ డాక్టర్లు సమ్మె చేపట్టి 12 రోజులవుతుంది. నగర వ్యాప్తంగా ఉన్న 20 ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. ఎమర్జెన్సీ, ఓపీడీ సేవలను కూడా డాక్టర్లు బహిష్కరించారు. డాక్టర్ల ధర్నాపై ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వైద్యులు సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి..సేవలందించారని పేర్కొన్నారు. వైద్యులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. డాక్టర్ల డిమాండ్లను ప్రధాని మోదీ అంగీకరించాలన్నారు.

కాగా..తమ కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రభుత్వ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన సమ్మె ప్రారంభించి 12 రోజులవుతోంది. పని ప్రదేశాల్లో భద్రత, కనీస మౌలిక అవసరాలు, సమయానికి జీతభత్యాల చెల్లింపు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పోరాటానికి దిగారు.

Vaccination Of Children : సరైన శిక్షణ పొందిన వారితో మాత్రమే పిల్లలకు కోవిడ్ టీకాలు వేయించాలి : కేంద్ర ఆరోగ్యశాఖ

ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న సుమారు 20 ఆసుపత్రులకు చెందిన ప్రభుత్వ వైద్యులు సుమారు 2000 మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో వైద్యసేవలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సఫ్దర్ జంగ్, మౌలానా అజాద్, రామ్ మనోహర్ లోహియా తదితర ఆసుపత్రులలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో మాత్రమే రోగులకు సేవలందిస్తుండగా నిన్నటి నుంచి ఎమర్జన్సీ సేవల్ని కూడా బహిష్కరించారు.

ఢిల్లీ నగర వ్యాప్తంగా ఉన్న 20 ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. ఎమర్జెన్సీ, ఓపీడీ సేవలను కూడా డాక్టర్లు బహిష్కరించారు. దీంతో ఆస్పత్రి బయట రోగుల బారులు తీరింది. దీంతో రోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ తల్లి అస్వస్థతగా ఉన్న తన బిడ్డను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. కానీ ఆమెను పట్టించుకున్నవారే లేరు.