Anil Chaudhary Lost Vote : ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఓటు గల్లంతు
ఓటేసేందుకు వెళ్లిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ చౌదరికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. అనిల్ చౌదరి ఓటు గల్లంతు అయింది. ఓటర్ లిస్టులో పేరు లేదని సిబ్బంది చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు. అంతేకాకుండా డిలీటెడ్ లిస్టులో కూడా లేకపోవడం గమనార్హం.

Anil Chaudhary lost vote : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఓటేసేందుకు వెళ్లిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ చౌదరికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. అనిల్ చౌదరి ఓటు గల్లంతు అయింది. ఓటర్ లిస్టులో పేరు లేదని సిబ్బంది చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు. అంతేకాకుండా డిలీటెడ్ లిస్టులో కూడా లేకపోవడం గమనార్హం.
తన పేరు ఓటర్ లిస్టులో, డిలీటెడ్ లిస్టులో లేదని అధికారులు చెప్పారని అనిల్ చౌదరి పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందన్న విషయంపై అధికారులు చెక్ చేస్తున్నారని తెలిపారు. అనిల్ చౌతరితోపాటు డల్లుపుర పోలింగ్ బూత్ కు వచ్చిన ఆయన భార్య మాత్రం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏకంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడి ఓటు కూడా గల్లంతవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో గత 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, ఆప్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి.