Delhi crime : తీసుకున్న అప్పు చెల్లించాలని వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికేసిన దంపతులు

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని భార్యాభర్తలు 72 ఏళ్ల వృద్ధురాలని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కాలువలో పారేసిన ఘటన ఢిల్లీ నగరంలో కలకలం రేపింది.

Delhi crime : తీసుకున్న అప్పు చెల్లించాలని వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికేసిన దంపతులు

Old Women Killed

couple kills Old woman: రూపాయి రూపాయి నవ్వేం చేస్తావు అంటూ బంధువుల మధ్య చిచ్చు పెడతా..ఆత్మీయుల మధ్య గొడవ పెడతా..అసవరం అయితే సాటి మనిషిని హత్య చేయిస్తా అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.డబ్బు కోసం అయినవారిని అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు ఎన్నో జరిగాయి.అప్పు తీసుకుని ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని డబ్బు ఇచ్చిన వ్యక్తులను దారుణంగా చంపేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటిదే జరిగింది దేశ రాజధాని ఢిల్లీ నగరంలో. ఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ర్హ్ ఏరియాలో తీసుకున్నఅప్పు తిరిగి చెల్లించ‌ాలని తమకు డబ్బు ఇచ్చి ఆదుకున్న ఓ వృద్ధురాలని అత్యంత దారుణంగా కడతేర్చారు భార్యాభర్తలు. 40 ఏళ్ల అనిల్ ఆర్య‌, 37 ఏళ్ల త‌న్న భార్యాభర్తలు. కవిత అనే 72 ఏళ్ల వృద్ధురాలు వద్ద అవసరానికి రూ. ల‌క్ష అప్పు తీసుకున్నారు. కవిత కొడుకు మనీష్ గ్రోవర్ కోడలితో కలిసి ఢిల్లీలోని మోహన్ గార్డెన్ లో నివసిస్తున్నారు.

కానీ ఆ డబ్బు తిరిగి చెల్లించటానికి వారికి ప్రాణం ఒప్పులేదు. ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. ఎలాగైనా సరే డబ్బులు ఎగవేయాలనుకున్నారు. దానికోసం దారుణంగా ఆలోచించారు. ఆమెను చంపేస్తే ఇక డబ్బు ఇవ్వక్కర్లేదు కదాని అనుకున్నారు ఆ దంపతుల‌ు. ఈలోపు తన వద్ద తీసుకున్న రూ.లక్ష ఇవ్వాలని వృద్ధురాలు అడిగింది. దానికి వాళ్లు అప్పుడిస్తాం…తరువాత ఇస్తాం..అంటూ వాయిదాలు వేశారు. దీంతో సదరు వృద్ధురాలు పదే పదే తన డబ్బు ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. అప్పు తిరిగి ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో అనిల్ ఉన్నాడు. ఈ క్ర‌మంలో వృద్ధురాలిని గొంతు నులిమి చంపేశారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి. ఆ త‌ర్వాత వృద్ధురాలి శ‌రీరాన్ని ముక్కలు ముక్కలుగా కోశారు. ఆ ముక్కల్ని వారికి సమీపంలో ఉన్న ఓ కెనాల్‌లో ప‌డేశారు. ఇక ఈ విషయం ఎవ్వరికీ తెలియదు కదాని అనుకున్నారు.

కానీ వారి పాపం బైటపడింది. కవిత కొడుకు మనీష్ గ్రోవర్ తన తల్లి కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సదరు దంపతుల్ని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం చెప్పారు.దీంతో కెనాల్‌లో ప‌డేసిన వృద్ధురాలి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు వెలికితీశారు.కేసు దర్యాప్తు చేస్తున్నారు.