Sushil Kumar: సాగర్ రానా మర్డర్ కేసులో సుశీల్ కుమార్‌ కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు

ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్, అతని సహచరుడు అజయ్ కు నాలుగు రోజులు కస్టడీని పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. సాగర్ రానా మార్డర్ కేసులో మరో నాలుగు రోజులు ఇంటరాగేషన్ జరగనుంది.

Sushil Kumar: సాగర్ రానా మర్డర్ కేసులో సుశీల్ కుమార్‌ కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు

Susheel Kumar

Sushil Kumar: ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్, అతని సహచరుడు అజయ్ కు నాలుగు రోజులు కస్టడీని పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. సాగర్ రానా మార్డర్ కేసులో మరో నాలుగు రోజులు ఇంటరాగేషన్ జరగనుంది. ముందుగా మే23 నుంచి విధించిన ఆరు రోజుల కస్టడీ ముగియడంతో మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు.

దాంతో పాటు ఢిల్లీ పోలీసులు 24గంటలకొకసారి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించాలని కోర్టు సూచించింది. ఈ నాలుగు రోజుల రిమాండ్ సమయంలోనే సుశీల్ కుమార్ లాయర్ అతణ్ని కలుస్తారని కోర్టు సూచించింది.

‘చట్టానికి ఎవరూ అతీతులు కారు. ప్రతి ఒక్కరినీ సమానంగానే చూస్తుంది. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది. వాళ్లు నిందితులైనా కాకపోయినా ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్‌కు, నిందితుల హక్కులకు బ్యాలెన్స్ చేయడమే కోర్ట్ డ్యూటీ.

ప్రస్తుత పరిస్థితుల్లో నిందితుల ఇద్దరిపైనా ఆరోపణలు చాలా సీరియస్ గా ఉన్నాయి. ఈ క్రైమ్ లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కూడా. దీనికి సంబంధించిన గ్యాంగ్ లను ఢిల్లీ, ఢిల్లీ పక్క ప్రాంతాల్లో ఉన్నా అరెస్టు అయ్యారు. మొబైల్ ఫోన్, బట్టలు వంటివి నిందితుల నుంచి రికవరీ అయ్యాయి’

అప్లికేషన్ ప్రకారం.. మరో నాలుగు రోజులు కస్టడీ పొడిగించాల్సి ఉంది. సుశీల్ కుమార్, అజయ్ కుమార్ సెహ్రావత్ లు కస్టడీలోనే ఉంటారు. పోలీస్ కస్టడీ జరుగుతున్న సమయంలో రూల్స్ ప్రకారం.. వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది’ అని కోర్టు ఆదేశించింది.

రెజ్లర్ సాగర్ రానా మర్డర్ కేసులో నిందితులైన సుశీల్, అజయ్ కుమార్ లు నెలారంభంలో పరారీలో ఉన్నారు. రెజ్లర్ సుశీల్ కుమార్ 2ఒలింపిక్ మెడల్స్, 3 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్స్, 1 వరల్డ్ ఛాంపియన్ షిప్ గోల్డ్, ఆసియన్ గేమ్స్ ఒక బ్రాంజ్, 4ఆసియన్ ఛాంపియన్ షిప్ మెడల్స్ గెలుచుకున్నాడు.