Delhi Covid Cases: ఢిల్లీలో భారీగా తగ్గిపోయిన కరోనా కేసులు

ఢిల్లీలో కరోనా కేసులు 4నెలలు వెనక్కు వెళ్లిపోయాయి. ఫిబ్రవరి 22న నమోదన కేసుల కంటే తక్కువగా 131 కేసులు మాత్రమే నమోదై రాష్ట్రంలో ధైర్యాన్ని నింపాయి. వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16గా నమోదైంది.

Delhi Covid Cases: ఢిల్లీలో భారీగా తగ్గిపోయిన కరోనా కేసులు

Delhi Covid Cases

Delhi Covid Cases: ఢిల్లీలో కరోనా కేసులు 4నెలలు వెనక్కు వెళ్లిపోయాయి. ఫిబ్రవరి 22న నమోదన కేసుల కంటే తక్కువగా 131 కేసులు మాత్రమే నమోదై రాష్ట్రంలో ధైర్యాన్ని నింపాయి. వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16గా నమోదైంది. పాజిటివిటీ రేట్ 0.22 శాతం ఉంటుండగా ఫిబ్రవరి 22 తర్వాత తక్కువగా నమోదైంది ఇప్పుడే.

ఢిల్లీలో రికవరీ రేట్ 98.03శాతం ఉండగా.. చావు రేటు 1.74శాతంగా ఉంది. ఇప్పటి వరకూ ఢిల్లీలో 14లక్షల 31వేల 270 కరోనా కేసులు నమోదు కాగా, అందులో 24వేల 839మంది చనిపోయారు. రికవరీ కేసులు మొత్తం 14లక్షల 3వేల 205గా ఉన్నాయి.

2021, జూన్ 14వ తేదీ సోమవారం నుంచి Unlock 3.0 అమల్లోకి వచ్చేసింది. ఈ అన్ లాక్ ప్రక్రియలో భాగంగా పలు రంగాలకు అనుమతులిస్తోంది. మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న సరి – బేసి విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసే ఉంటాయి.

మతపరమైన పండుగలు, విద్యా, సాంస్కృతిక, క్రీడలపై ఆంక్షలు కొనసాగనున్నాయని వెల్లడించారు. కొవిడ్ కేసుల సంఖ్య రెండు నెలల కనిష్టానికి పడిపోవడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సడలింపులు ప్రకటించారు. రాష్ట్రంలో ఇదే స్థాయిలో కరోనా కేసులు తగ్గుతుంటే మాత్రం రానున్న రోజుల్లో తిరిగి సాధారణ జీవితంలోకి రాగలమని ఆయన అన్నారు. అందరకూ కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, కేసుల సంఖ్య కూడా తగ్గిందని కేజ్రీవాల్ అన్నారు. అయితే, కేసులు పెరిగినట్లయితే ఆంక్షలు తిరిగి అమల్లోకి వస్తాయని ఆయన హెచ్చరించారు.

స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, స్పోర్ట్ కాంప్లెక్స్ తెరిచి ఉండవు. జిమ్‌లు, యోగా కేంద్రాలు, పబ్లిక్ పార్క్ లు, స్పాలు మూసే ఉంటాయి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ ఏ అధికారులు వంద శాతం, మిగతా గ్రూపుల్లో 50 శాతం సిబ్బంది విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. 50 శాతం సిబ్బందితో నిర్వహించుకోవాల్సి ఉంటుంది.

సిటీ బస్సుల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపించాల్సి ఉంటుంది. ఆటోలు, రిక్షాలు, టాక్సీల్లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మార్కెట్ కాంప్లెక్స్ లు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పూర్తి కార్యకలాలపాలు జరుపుకోవచ్చు. జోన్ కు ఒక వారం సంత నిర్వహించుకోవచ్చని, ఫంక్షన్ హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో వివాహాలు చేసుకోవడానికి అనుమతినివ్వడం, కేవలం 20 మందితో ఇళ్ల వద్దే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే..ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు అనుమతిలేదని స్పష్టం చేశారు. అంత్యక్రియల్లో 20 మంది పాల్గొనేందుకు అనుమతి ఉంటుంది.

ఏమి తెరుస్తారు.. వేటిని మూస్తారంటే? :
– పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు మూసివేత.
– రాజకీయ / సాంస్కృతిక సమావేశాలపై నిషేధం.
– స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, స్పాస్, పబ్లిక్ పార్కులు, గార్డెన్లు మూసివేత.
– బహిరంగ మందిరాల్లో పెళ్లిళ్లకు అనుమతి లేదు. 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
– ఢిల్లీ మెట్రోతో సహా ప్రజా రవాణా 50 శాతం సామర్థ్యంతో నడుస్తుంది.
– ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే ఆటోరిక్షాలు, టాక్సీలలో ఉంటారు.

వేటికి అనుమతి ఉందంటే? :
– అన్ని మార్కెట్ కాంప్లెక్సులు తెరిచే ఉంటాయి.. కానీ, ఉదయం 10 గం నుంచి రాత్రి 8 గంటల వరకు.
– 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు తెరిచే ఉంటాయి.
– ఢిల్లీలో సెలూన్లు, వీక్లీ మార్కెట్లు తెరుస్తారు.
– ప్రతి జోన్‌లో ఒక మార్కెట్ మాత్రమే అనుమతిస్తారు.
– నగరంలోని ప్రార్థనా మందిరాలు కూడా తెరుచుకుంటాయి. కాని భక్తులను అనుమతించరు.