Delhi Covid : ఢిల్లీలో తగ్గుతున్న కరోనా.. కొత్తగా 6,028 కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 6,028 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Delhi Covid : ఢిల్లీలో తగ్గుతున్న కరోనా.. కొత్తగా 6,028 కేసులు

Delhi Covid Cases

Delhi Covid : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 6,028 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది కరోనాతో మృతిచెందారు. మంగళవారం మొత్తం 57, 132 మందికి టెస్టులు నిర్వహించారు. సోమవారం మాత్రం 9వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా నుంచి 9127 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఢిల్లీలో కరోనా మరణాల సంఖ్య 25,681కి చేరింది. రోజువారి పాజిటివిటి రేటు 10.55 శాతానికి చేరింది.

ఢిల్లీలో ప్రస్తుతం 42,010 యాక్టీవ్ కేసులు ఉండగా..  ఇప్పటివరకు 1,80,34,99 కేసులు నమోదయ్యాయి. 25,681 మంది కరోనాతో మృతి
చెందారు.  కరోనా కట్టడికి కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ వ్యాప్తంగా 44,547 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ముంబైలో 22వేల 185 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో త్వరలోనే ఇన్ఫెక్షన్‌ రేటు ఆధారంగా ఢిల్లీకి ఆంక్షల నుంచి విముక్తి కల్పిస్తామని సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఢిల్లీలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే కరోనా మరణాల్లో మాత్రం పెద్దగా తేడా కనిపించడం లేదు.


57,132 కొవిడ్ పరీక్షలు జరిగాయి. గత రెండు వారాల క్రితం వరకు ప్రతిరోజు 90వేలకుపైగా పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం కరోనా టెస్టులను గణనీయంగా తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే 9,127 మంది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 18,03,499కు చేరింది. మరో 17,35,808 మంది కోలుకున్నారని ఢిల్లీ ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనాతో మొత్తం 25,681 మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది. ప్రస్తుతం మరణాల రేటు 1.42శాతంగా నమోదైంది. ప్రస్తుతం 42వేలకుపైగా యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది.

Read Also : Telangana Corona Cases : తెలంగాణలో 4వేలకు పైగా కరోనా కేసులు నమోదు