Delhi COVID : కొత్త ఆంక్షలు..పెళ్లిళ్లకు 200 మంది, అంత్యక్రియలకు 50 మంది మాత్రమే

ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కొత్త ఆంక్షలు విధించింది.

Delhi COVID : కొత్త ఆంక్షలు..పెళ్లిళ్లకు 200 మంది, అంత్యక్రియలకు 50 మంది మాత్రమే

COVID Restrictions

Restrictions : ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కొత్త ఆంక్షలు విధించింది. వివాహ వేడుక‌ల‌కు 200 మందికి మించి అతిథులు హాజ‌రు అవ్వకూడదని.. ఔట్ డోర్ వేడుక‌లకు 100 మందికి మించి అనుమతించేది లేదని తెలిపింది.అంత్యక్రియ‌ల‌కు 50 మందికి మించి రాకూడదని వెల్లడించింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు అమ‌లులోకి ఉంటాయని చెప్పింది.

వేడుక‌లు జ‌రిగే హాళ్లలో 50 శాతం వ‌ర‌కు గ‌రిష్టంగా, బ‌హిరంగ ప్రదేశాల్లో 100 మందిని మాత్రమే అనుమ‌తిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫేస్‌మాస్క్‌లు ధ‌రించి, సామాజిక దూరం పాటిస్తూ, థ‌ర్మల్ స్కానింగ్‌ అమ‌లుతో పాటు శానిటైజ‌ర్‌తో హ్యాండ్ వాష్ లాంటి కరోనా నిబంధ‌న‌లు పాటిస్తే, 200 మందిని వరకు అనుమ‌తిస్తామని వెల్లడించింది.

ఢిల్లీలో కొత్తగా 1,558 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. వ‌రుస‌గా మూడోరోజు 1,500కి పైగా కేసులు రికార్డయ్యాయి. గ‌త డిసెంబ‌ర్ 15న న‌మోదైన 1,617 మంది త‌ర్వాత అత్యధికంగా క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంఇదే తొలిసారి. గ‌త 24 గంట‌ల్లో కరోనాతో 10 మంది మ‌ర‌ణించారు. 75 రోజుల తర్వాత ఇదే అత్యధికం.

మరోవైపు..కరోనా కేసులు పెరుగుతుండటంతో హోలీ సంబరాలపై వివిధ రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి.. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం హోలీ వేడుకలపై నిషేధం విధించింది..ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్, హర్యానాలు ఆంక్షలు విధించాయి..ఇటు తెలంగాణలోనూ హోలీ పండగపై కరోనా ఎఫెక్ట్ పడింది. హోలీ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. హోలీ ఈవెంట్లకు అనుమతి లేదని చెప్పారు.

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యే దీనికి అద్దం పడుతోంది.. గతేడాది అక్టోబర్ 16 తర్వాత దేశంలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య 62 వేలు దాటింది.. అదే సమయంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షల 53 వేలకు చేరువ కావడం మరోసారి కంగారు పెట్టిస్తోంది.
Read More : Mumbai Night curfew : ముంబైలో నైట్ కర్ఫ్యూ : కరోనా కట్టడికి ఉద్ధవ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం