Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

Manish Sisodia: రాజకీయంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఘటన చోటు చేసుకుంది. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.

Nikki Haley: శత్రు దేశాలకు సాయం నిలిపివేస్తాం.. పాక్, చైనాలకు కూడా: నిక్కీ హేలీ

ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను అరెస్టు చేశారు. విచారణకు సహకరించకపోవడం, దినేష్ అరోరాతోపాటు పలువురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం, సీబీఐ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.

Twitter: ట్విట్టర్‌లో ఎనిమిదోసారి ఉద్యోగాల కోత.. ఈసారి ఎంత మందిని తొలగించారంటే..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా ఏ1గా ఉన్నారు. గత ఏడాది ఆగష్టులోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా మద్యం వ్యాపారుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మీడియా ఇంచార్జి విజయ్ నాయర్ ద్వారా రూ.100 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ముడుపులు మనీష్ సహా పలువురు ఆప్ నేతలకు చేరినట్లు, వాటిని పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఆరోపిస్తోంది సీబీఐ. గతంలో ఈ కేసులో సీబీఐ పలువురిని అరెస్టు చేసింది.

Punjab Jail: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హంతకులు మృతి

విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, బుచ్చి బాబును ఇప్పటికే అరెస్టు చేయగా, తాజాగా మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. ఆరు నెలలుగా సీబీఐ, ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్నాయి. మనీష్ సిసోడియాకు సీబీఐ వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఈ కేసులో ఈ రోజు తనను అరెస్టు చేస్తారని ముందుగానే మనీష్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.