కరోనా పోరాటంలో ముందుండి…ఇప్పుడు అదే వైరస్ కి బలైపోయిన ఢిల్లీ డాక్టర్

  • Published By: venkaiahnaidu ,Published On : July 21, 2020 / 08:41 PM IST
కరోనా పోరాటంలో ముందుండి…ఇప్పుడు అదే వైరస్ కి బలైపోయిన ఢిల్లీ డాక్టర్

ఢిల్లీ ప్రభుత్వపు జాతీయ ఆరోగ్య మిషన్‌(National Health Mission)లో పనిచేస్తున్న 42 ఏళ్ల కాంట్రాక్టు వైద్యుడు డాక్టర్ జావేద్ అలీ సోమవారం కరోనావైరస్‌తో మరణించాడు.

డాక్టర్ జావేద్ అలీ మార్చి నుండి కరోనా మహమ్మారి వ్యతిరేకగా పోరాటంలో ముందున్న డాక్టర్ జావేద్ అలీకి జూన్ 24 న కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి అయన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. గత 10 రోజులుగా, అతను వెంటిలేటర్‌లో ఉన్నాడు. నిన్న ఉదయం డాక్టర్ అలీ… ఎయిమ్స్ ట్రామా సెంటర్ లో మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు( ఆరేళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె) ఉన్నారు.

అయన కుటుంభం సభ్యులు పరిహారం కోసం డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులకు పగలు, రాత్రి పనిచేసినప్పటికీ ఎలాంటి సహాయం అందించడం లేదని వారు ఆరోపించారు. మార్చ్ నెల నుంచి తన భర్త ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని,ఈద్ రోజు కూడా హాస్పిటల్ కి వెళ్లి తన విధులు నిర్వహించడని మృతుడైన డాక్టర్ భార్య తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రారంభ చికిత్స కోసం అయ్యే ఖర్చును కూడా తామే భరించినట్లు ..సుమారు 6 లక్షల రూపాయలు తామే ఖర్చు చేసాము అని ఆమె చెప్పారు.

ఈ ఇష్యూ గురుంచి ఎన్‌హెచ్‌ఎం వైద్యుల సంక్షేమ సంఘం కూడా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు లేఖ రాసింది. ఢిల్లీలో COVID-19 విధుల్లో 240 మంది వైద్యులతో సహా 2 వేల మంది NHM సభ్యులు ఉన్నారు.

గత వారం, దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ – ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) భారతదేశంలో 11.5 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసిన కరోనావైరస్ పై పోరాటంలో ఉన్నవారికి “రెడ్ అలర్ట్” జారీ చేసింది. ఇప్పటివరకు తొంభై తొమ్మిది మంది వైద్యులు మరణించారని, 1,300 మందికి పైగా సోకినట్లు బాడీ మెడికల్ బాడీ తెలిపింది