Delhi Air Quality Index : ఢిల్లీలో తగ్గిన వాయుకాలుష్యం-29 నుంచి స్కూళ్లు ప్రారంభం

ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత మెరుగుపడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Delhi Air Quality Index : ఢిల్లీలో తగ్గిన వాయుకాలుష్యం-29 నుంచి స్కూళ్లు ప్రారంభం

Gopal Rai

Delhi Air Quality Index :  ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత మెరుగుపడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 29 నుంచి ఢిల్లీలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, తెరవాలని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.

నవంబర్ 27 నుంచి అన్ని సిఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాలను ఢిల్లీలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కోన్నారు. డిసెంబరు 3 వరకు ఇతర వాహనాల ప్రవేశంపై విధించిన నిషేధం కొనసాగుతుందని ఆయన తెలిపారు. వాయు కాలుష్య తీవ్రత పెరగడంతో నవంబర్ 15 నుంచి ప్రభుత్వం ఢిల్లీలో పాఠశాలలను మూసివేసింది.

ఢిల్లీలోవాయు కాలుష్య తీవ్రత క్రమేపి తగ్గుతోందని గోపాల్ రాయ్ చెప్పారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో (Air quality index (AQI)) వాయు నాణ్యత సూచిక 357 గా నమోదైంది. వాతావరణ శాఖ అందించిన లెక్కల ప్రకారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్‌గా   నమోదైంది. ఇది ఈ సీజన్ లో ఇప్పటి వరకు  నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత.

Also Read : Delhi NCR Air Pollution : ఢిల్లీ ఎన్సీఆర్ వాయు కాలుష్యంపై సుప్రీంలో విచారణ-29కి వాయిదా
ఆది, సోమవారాలలో వీచిన బలమైన గాలుల వల్ల గాలిలో నాణ్యత పెరగటానికి దోహదపడినట్లు ఆయన చెప్పారు. పొరుగున ఉన్న ఫరీదాబాద్ (348), ఘజియాబాద్ (346), గ్రేటర్ నోయిడా (329), గుర్గావ్ (308), నోయిడా (320)లలో కూడా బుధవారం ఉదయం గాలి నాణ్యత మెరుగు పడింది.