హాట్రిక్‌పై కన్నేసిన కేజ్రీవాల్ : AAP మరో క్లీన్ స్వీప్ చేస్తుందా? 

  • Published By: sreehari ,Published On : February 11, 2020 / 01:34 AM IST
హాట్రిక్‌పై కన్నేసిన కేజ్రీవాల్ : AAP మరో క్లీన్ స్వీప్ చేస్తుందా? 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలోకి రానుందా? ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేయనుందా? ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధానిపైనే ఉంది. కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ అధికారంపై కన్నేశారు.

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి  #DelhiResults ఓట్ల లెక్కింపు జరుగనుంది. ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. నువ్వానేనా సై అంటూ ఎన్నికల బరిలో నిలిచాయి. పోటాపోటీగా ప్రచారాలను నిర్వహించాయి. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఢిల్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తునా ప్రచారం చేశారు. కాంగ్రెస్ కూడా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. 

ఇంతకీ ఢిల్లీ అధికారం ఎవరికి దక్కనుంది? హస్తినా ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు. ఓటర్ల తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే యాప్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా మార్చాలనే తన ఆశయాన్ని పునరుద్ధరించగలరా? ఎన్నికల తీర్పు.. ఎగ్జిట్ పోల్స్ సరైనదని రుజువు చేస్తే.. చీపురు పార్టీ ఢిల్లీని మరోసారి ఊడ్చేయడం ఖాయమైనట్టే. అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తారని, ఆప్ మూడింట రెండు వంతుల మెజారిటీతో విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవంగా ప్రకటించాయి.

70 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో ఆప్  సంఖ్య 44, 68 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. 70 మంది సభ్యుల గల ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల ఫలితాలను తెలుసుకోవాలనే ప్రజలలో ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అనంతరం #DelhiResults ఢిల్లీ ఫలితాలపై మరింత టెన్షన్ పెంచేసింది. అధికార ఆప్‌కు పెద్ద విజయాన్ని అందిస్తుందని అంచనా వేసింది. తుది ఓటరును అధికారులు ప్రకటించడంలో ఆలస్యం జరిగింది. 672 మంది అభ్యర్థుల్లో 593 మంది పురుషులు , 79 మంది మహిళల భవితవ్యం ఎన్నికల ఫలితాల్లో తేలనుంది. 

ఢిల్లీలో పోలింగ్ ముగిసిన దాదాపు 24 గంటల తరువాత.. ఎన్నికల కమిషన్ ఆదివారం తుది ఓటరు 62.59 శాతం, 2015 కన్నా ఐదు శాతం తక్కువ అని ప్రకటించింది. ఢిల్లీ సీఈఓ కార్యాలయంలోని అధికారులు ఓట్ల లెక్కింపు కోసం సన్నద్ధమవుతున్నారు. 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న దేశ రాజధానిలోని 21 ప్రాంతాల్లో కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

తూర్పు ఢిల్లీలోని సిడబ్ల్యుజి స్పోర్ట్స్ కాంప్లెక్స్, పశ్చిమ ఢిల్లీలోని ఎన్ఎస్ఐటి ద్వారకా, మీరాబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  ఆగ్నేయ ఢిల్లీలోని జిబి పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సర్ సివి రామన్ ఐటిఐ, సెంట్రల్ ఢిల్లీలోని ధీర్పూర్,  బవానాలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. ఉత్తర ఢిల్లీ, ఇతర ప్రదేశాలలో 33 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారని అధికారులు తెలిపారు. వివిధ కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.