మా వంటింటికి రండి జిలేబీ, పకోడీలు,టీ కూడా ఇస్తాం..వ్యవసాయ మంత్రికి రైతు నేతల ఆహ్వానం

  • Published By: nagamani ,Published On : December 2, 2020 / 10:56 AM IST
మా వంటింటికి రండి జిలేబీ, పకోడీలు,టీ కూడా ఇస్తాం..వ్యవసాయ మంత్రికి రైతు నేతల ఆహ్వానం

Delhi : Farmer call minister  Tomar  jalebi, pakoda  tea’ ofer : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు రైతులు ఢిల్లీలో కదం తొక్కిన విషయం తెలిసిందే. పండించిన పంటలకు మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా దేశ రాజధానిలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.



ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 1,2020) 36 మంది రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. రైతు నేతలతో సుదీర్ఘ సమావేశం విరామం సమయంలో వ్యవసాయం మంత్రి తోమర్ వారికి టీ పంపించారు.అనంతరం సుదీర్ఘ చర్చలు జరిగినా ఫలితం కనిపించలేదు.దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.



కాగా..ఈ చర్చల్లో ఓ ఆసక్తికర అంశం జరిగింది. మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..‘‘మీరు మాకు టీ ఇచ్చారు. చాలా సంతోషం..మీరు కూడా మా వద్దకు రండి అని ఆహ్వానించారు. రైతు నేత జమ్హురి, కిసాన్ సభ చీఫ్ కుల్వంత్ సింగ్ సాధులు మాట్లాడుతూ..‘‘మీరు మేం ఏర్పాటు చేసుకున్న సామూహిక వంటశాల వద్దకు వస్తే..టీతో పాటు జిలేబీ, పకోడీలు కూడా పెడతామని’’ అవేకాకుండా మరిన్ని ఇస్తామని ఆహ్వానించారు. దీంతో సమావేశంలో నవ్వులు విరిశాయి.



సమావేశం అనంతరం రైతు సంఘాల నేతలు జమ్హురి, కుల్వంత్ సింగ్ లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”తోమర్ సాబ్ మమ్మల్ని టీ తీసుకోవాలని కోరారు. దానికి మేం నిరసనలు తెలుపుతున్న ప్రాంతానికి వస్తే, జిలేబీ, పకోడీలను కూడా కలిపి ఇస్తామని చెప్పాం. దీంతో అందరూ నవ్వారు”అని తెలిపారు. తమ చర్చల్లో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసే అంశం కూడా తెరపైకి వచ్చిందని అన్నారు.



ఈ సమావేశంలో రైతుల తరఫున 35 మంది పాల్గొన్నామని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే ఉద్దేశంతో లేదని తెలుసుకున్నామని ..అందువల్లే రైతులు లేవనెత్తిన అంశాల పరిష్కారానికి కమిటీని వేస్తామన్న ప్రతిపాదనను తాము తిరస్కరించామని వారు స్పష్టం చేశారు. కాగా.. కేంద్రం, రైతు సంఘాల మధ్య మరోసారి చర్చలు జరుగనున్నాయి. మరి ఈ చర్చల్లో అయినా రైతన్న కోరికను మన్నిస్తారో లేదో వేచి చూడాలి.