వాడి ఫోనులో 500ల మంది అమ్మాయిల నంబర్లు..అశ్లీల మెసేజులు..వీడియోలు పంపుతూ వేధింపులు

  • Published By: nagamani ,Published On : September 8, 2020 / 10:59 AM IST
వాడి ఫోనులో 500ల మంది అమ్మాయిల నంబర్లు..అశ్లీల మెసేజులు..వీడియోలు పంపుతూ వేధింపులు

టెక్నాలజీని అడ్డు పెట్టుకుని వందలమంది అమ్మాయిల్నీ..మహిళల్ని వేధింపులకు గురి చేస్తూ రాక్షసానందం పొందో ఓ కామాంధుడిని ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు..10 కాదు20 కాదు ఏకంగా 500లమంది మహిళల ఫోన్ నంబర్లను సంపాదించి వారికి అసభ్యకరమైన మెసేజ్ లు..వీడియోలు..ఫోటోలు పంపుతు నానా వేధింపులకు గురిచేస్తున్నకామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఢిల్లీలోని NCRలో ఈ ఘటన చోటుచేసుకుంది.


కేవలం 5 వ క్లాస్ మాత్రమే చదువుకున్న దీపక్ అనే 22 కుర్రాడు మహిళలను వలపన్ని పట్టుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. చదువు లేకపోయినా టెక్నాలజీలో మాత్రం దిట్ట. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువతులు, మహిళలకు సంబంధించిన 500 ఫోన్ నంబర్లు సేకరించి తన ఫోన్ లో ఫీడ్ చేసుకున్నాడు. సాధారణంగా ఏదోక నంబరుకు ఫోన్ చేసేవాడు. ఎవరైనా మహిళలు ఫోన్ ఎత్తి మాట్లాడితే.. ఆ నంబర్ ఆడవాళ్లదేనని నిర్ధారించుకుని ఆ నంబర్ ని సేవ్ చేసుకునేవాడు.


ఆ తరువాత వారికి వాట్సప్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు..ఫోటోలు..వీడియోలు పంపేవాడు. వాడెవడో తెలీదు..ఎందుకు పంపిస్తున్నాడో తెలీదు..దీంతో విసిగిపోయిన చాలామంది మహిళలు అతని నంబర్ బ్లాక్ చేసేవారు. కానీ టెక్నాలజీ తెలిసున్న దీపక్ మాత్రం విడిచిపెట్టేవాడు కాదు..ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగించి వారికి ఫోన్ చేసేవాడు. తన కాంటాక్ట్ నంబరు కనిపించకుండా ఆ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి.. తన ఐపీ అడ్రస్ కూడా దొరకకుండా జాగ్రత్తపడేవాడు. అలా తరచూ అదేపనిగా ఫోన్లు చేస్తూ వేధిస్తుండేవాడు.


ఈ క్రమంలో ఓ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పటినుంచి ఆమె నంబరుపై నిఘా పెట్టారు. వాట్సాప్ కాల్ ఆధారంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేసి అతడిని పట్టుకున్నారు. నిందితుడిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసామని పోలీసులు తెలిపారు.
https://10tv.in/17-year-old-girl-raped-by-3-men-on-separate-occasions-in-tamilnadu-found-to-be-8-months-pregnant/
ఈ విషయమై ఘజియాబాద్ ఎస్ఎస్పీ కళానిధి నైతని మాట్లాడుతూ.. నిందితుడి లొకేషన్ ట్రేస్ చేసేందుకు నెల రోజులు పట్టిందనీ..ఒక యువతికి చేసిన వాట్సాప్ కాల్ ద్వారా ఎట్టకేలకూ అతడి ఐపీ అడ్రస్ పట్టుకోగలిగాం. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు.


తనకు తెలిసిన వారి ఫోన్ నంబర్లను ఉపయోగించి ఎన్నో ఫేక్ వాట్సాప్ అకౌంట్లు ఓపెన్ చేసేవాడనీ..వాటి ద్వారా మహిళలను వేధించేవాడు. అలాగే ఇలాంటి చర్యలు నిరోధించేలా వాట్సాప్ సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాట్సాప్‌ను కోరతామని తెలిపారు.