Chhath Puja : నవంబర్ 10వ తేదీ హాలీడే

యుమునా నది మినహా...సిటీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఛాత్ పూజ నిర్వహించడానికి అనుమతినిస్తున్నట్లు ఢిల్లీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ గత వారం ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే.

Chhath Puja : నవంబర్ 10వ తేదీ హాలీడే

Delhi

Chhath Puja Public Holiday : నవంబర్ 10వ తేదీన జరిగే ఛాత్ పూజకు మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పూజకు అవసరమయ్యే సామాను కొనుగోలు కోసం మార్కెట్ లకు బయలుదేరుతున్నారు. దీంతో పలు మార్కెట్ లన్నీ సందడిగా మారిపోయాయి. ఛాత్ పూజను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంటారు. నేషనల్ క్యాపిటల్ టెరిటోరి (ఎన్సీటీ) ప్రాంత ప్రజలకు చాలా ముఖ్యమైన పండుగ.

Read More : Athiya Shetty Birthday : లవ్ పార్ట్‌నర్ ఎవరో చెప్పిన రాహుల్

ఈ క్రమంలో..ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021, నవంబర్ 10వ తేదీన ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. యుమునా నది తీరాన మినహా…సిటీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఛాత్ పూజ నిర్వహించడానికి అనుమతినిస్తున్నట్లు ఢిల్లీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ గత వారం ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే.

Read More : Uttarakhand Temples Closed : శీతాకాలం ప్రారంభం..య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాలు మూసివేత‌

దీపావళి తర్వాత వచ్చే కీలక పండుగల్లో ఛాత్ పూజ ఒకటి. భక్తులు సూర్య దేవుడికి వందనాలు, అర్ఘ్యాలు సమర్పిస్తారు. నదులు, చెరువులు, ఇతర జలవనరులకు పూజలు చేయడం ద్వారా ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలుపుతారు. ప్రత్యేకించి ఉత్తరాదిన ఈ పండుగ ఘనంగా జరుపుకొంటారు. బీహార్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఛాత్ పూజ నిర్వహిస్తుంటారనే సంగతి తెలిసిందే. మహిళలు మోకాళ్ల లోతునీళ్లలో నిలబడి..సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రధానం చేశారు. ఈ పర్వదినం సందర్భంగా…మహిళలు ఉపవాసం నిర్వహిస్తుంటారు.