వన్ ఢిల్లీ.. వన్ రైడ్ : మెట్రో, బస్సు జర్నీ ఈజీ

దేశ రాజధాని ఢిల్లీలో ఇక పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ఈజీ కానుంది. ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు సంబంధించి కొత్త యాప్ ను లాంచ్ చేసింది. అదే.. కామన్ మెబిలిటీ యాప్ ‘వన్ ఢిల్లీ’..

  • Published By: sreehari ,Published On : March 6, 2019 / 10:29 AM IST
వన్ ఢిల్లీ.. వన్ రైడ్ : మెట్రో, బస్సు జర్నీ ఈజీ

దేశ రాజధాని ఢిల్లీలో ఇక పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ఈజీ కానుంది. ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు సంబంధించి కొత్త యాప్ ను లాంచ్ చేసింది. అదే.. కామన్ మెబిలిటీ యాప్ ‘వన్ ఢిల్లీ’..

దేశ రాజధాని ఢిల్లీలో ఇక పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ఈజీ కానుంది. ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు సంబంధించి కొత్త యాప్ ను లాంచ్ చేసింది. అదే.. కామన్ మొబిలిటీ యాప్ ‘వన్ ఢిల్లీ’.. ఈ యాప్ ద్వారా ఢిల్లీ మెట్రో, అన్నీ సిటీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. వన్ ఢిల్లీ.. వన్ రైడ్ అనే ఈ యాప్ ను ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ (DIMTS) రూపొందించింది.
Also Read : F-16 పాక్ దుర్వినియోగం: భారత్ ఆధారాలు..అమెరికా దర్యాప్తు

‘‘ఢిల్లీలో ఈజీగా ట్రావెల్ చేసేందుకు యూజర్లకు అందుబాటులోకి తెచ్చాం. సిటీలో అన్నీ బస్ స్టాప్ లు, మెట్రో రూట్లు, ధరలు, పట్టే సమయం (ఎఫ్ టీఏ)లను ఈ యాప్ నుంచి తెలుసుకోవచ్చు’’ అని ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ కైలాష్ గహ్లోట్ కామన్ మొబిలిటీ కార్డ్ – ఒన్ కార్డ్ యాప్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో తొలిసారి వన్ ఢిల్లీ యాప్ ను లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. 

అన్నీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ (బస్సు, మెట్రో రూట్స్, బస్ స్టాప్ లు, రియల్ టైం అరైవల్ ఇన్ఫర్మేషన్, జర్నీ ప్లానింగ్)ల్లో వినియోగించుకోవచ్చు. నగరవ్యాప్తంగా వన్ ఢిల్లీ యాప్ సర్వీసును అన్నీ చోట్ల మెరుగుపర్చేదిశగా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. బస్సు భద్రతపై విశ్వసనీయత ఉందన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విధానాన్ని అందికి ఆమోదయోగ్యంగా ఉండేలా చేయడమే తమ లక్ష్యమని మంత్రి కైలాష్ చెప్పారు.  
Also Read : హస్తినపై టీఆర్ఎస్ గురి : 16 ఎంపీలను గెలిపించండి – కేటీఆర్

భవిష్యత్తులో ఈ వన్ ఢిల్లీ యాప్ లో రీఛార్జ్ విధానం వంటి కొత్త ఫీచర్లను కూడా యాడ్ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు డైలాగ్ అండ్ డెవలప్ మెంట్ కమిషన్ వైస్ చైర్మన్ జాస్మిన్ షా తెలిపారు. ప్రస్తుతం వన్ ఢిల్లీ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వన్ ఢిల్లీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. త్వరలో ఆపిల్ ఫోన్ యూజర్లకు కూడా ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 
Also Read : మరీ విడ్డూరం : పాక్‌ టీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అభినందన్