Delhi Night Curfew : ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలకు ముగింపు, కర్ఫ్యూ ఎత్తివేత.. స్కూల్స్ రీ ఓపెన్

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన DDMA సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియ

Delhi Night Curfew : ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలకు ముగింపు, కర్ఫ్యూ ఎత్తివేత.. స్కూల్స్ రీ ఓపెన్

Night Curfew

Delhi COVID-19 Restrictions :  భారతదేశంలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీంతో పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నారు. పాజిటివ్ కేసులు తక్కువ కావడంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథార్టీ (DDMA) కోవిడ్ 19 పరిమితులను ఎత్తివేసింది. సోమవారం నుంచి ఢిల్లీలో కర్ఫ్యూను ఎత్తివేయనుంది. అయితే..మాస్క్, భౌతిక దూరం, శానిటేజేషన్ తప్పనిసరిగా పాటించాలని, ఏప్రిల్ 01వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని సూచించింది.

Read More : Ukraine AP Students : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సీఎం జగన్ ఫోన్

2022, ఫిబ్రవరి 25వ తేదీ శుక్రవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన DDMA సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మాస్క్ లు ధరించకుండా ఇప్పటి వరకు ఉన్న రూ. 2000 వేల జరిమానాను రూ. 500 తగ్గిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయబడుతాయని ఢిల్లీ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీతో సహా చాలా వ్యాపార సంస్థలు ఢిల్లీ LGని సంప్రదించాయి. దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలకు భక్తులను సందర్శకులను అనుమతించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా.. గవర్నర్ కు లేఖ రాశారు.