ఢిల్లీ వాసులకే రాజధాని హాస్పిటల్స్…కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

  • Published By: venkaiahnaidu ,Published On : June 7, 2020 / 09:56 AM IST
ఢిల్లీ వాసులకే రాజధాని హాస్పిటల్స్…కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా పేషెంట్లను చేర్చుకునేందుకు దేశ రాజధానిలోని హాస్పిటల్స్  ఢిల్లీ వాసులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని హాస్పిటల్స్ ఢిల్లీకి చెందిన కరోనా పేషెంట్లను మాత్రమే చేర్చుకుంటాయని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు న్యూరో సర్జరీ వంటి కొన్ని ప్రత్యేక సర్జరీలు చేసేవి తప్ప మిగిలిన ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఢిల్లీ నివాసితులకు కూడా రిజర్వ్ చేయబడ్డాయని కేజ్రీవాల్ తెలిపారు.

కరోనా రోగులకు ఆస్పత్రులు సరిపోవడం లేదని గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై సర్వే నిర్వహించామని.. 90 శాతం మంది ప్రజల అభిప్రయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ అన్నారు. అయితే, ఢిల్లీలో కేంద్రప్రభుత్వానికి చెందిన హాస్పిటల్స్ లో మాత్రం అందరినీ చేర్పించుకుంటారని అన్నారు.

జూన్ చివరి నాటికి ఢిల్లీకి 15వేల పడకలు అవసరమవుతాయని.. ప్రభుత్వం ద్వారా నియమించిన ఓ కమిటీ తెలిపిందన్నారు. అయితే, అందులో ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇస్తే.. 9వేల పడకలు మూడు రోజుల్లో నిండిపోతాయని అన్నారు. కాబట్టి, న్యూరో సర్జరీ లాంటి ప్రత్యేక శస్త్ర చికిత్రలు చేసే ఆస్పత్రులు తప్ప.. మిగిలిన ప్రైవేట్ ఆస్పత్రులు అన్ని ఢిల్లీ వారికే కేటాయించాలని కేజ్రీవాల్ అన్నారు.

మరోవైపు,సోమవారం(జూన్-8,2020)నుంచి ఢిల్లీ బోర్డర్లు తెరుస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో రేపటి నుంచి రెస్టారెంట్లు,మాల్స్,ప్రార్థనా మందిరాలు తెరుచుకుంటాయన్నారు. హోటల్స్ మరియు బ్యాంకెట్ హాల్స్,సినిమా హాల్స్,జిమ్ లు,స్పాలు మాత్రం యధావిధిగా మూతపడే ఉంటాయని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, వృద్ధులు వారి కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో, ముఖ్యంగా పిల్లలతో కనీస పరస్పర దూరం కలిగి ఉండాలని, ఎందుకంటే సీనియర్ సిటిజన్లు COVID19 కు ఎక్కువగా గురవుతారని కేజ్రీవాల్ తెలిపారు.ఇంటిలోనే ఓ గదిలో ఉండేందుకు వృద్ధులు ప్రయత్నించాలని కేజ్రీవాల్ కోరారు.

కాగా, దేశరాజధానిలోని హాస్పిటల్స్ ను కేవలం ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంచుతూ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. కేజ్రీవాల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ కుమార్ గుప్తా,మరికొందరు కాషాయ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించగా,వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.