Six Families: ఆరుగురి కుటుంబాలకు.. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా!

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు ఆర్మీ, పోలీస్ సిబ్బందికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూ. కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈమేరకు ఓ ప్రకటన చేశారు.

Six Families: ఆరుగురి కుటుంబాలకు.. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా!

Six Families

Rs. 1 crore ex-gratia: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు ఆర్మీ, పోలీస్ సిబ్బందికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూ. కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈమేరకు ఓ ప్రకటన చేశారు. ప్రాణాలు కోల్పోయిన సిబ్బందిలో ముగ్గురు వైమానిక దళంలో పనిచేసినవారు కాగా.. ఇద్దరు ఢిల్లీ పోలీసు విభాగంలో చేసినవారు. ఒకరు సివిల్ డిఫెన్స్‌లో పనిచేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా ఢిల్లీ ప్రభుత్వం నిలబడిందని ఉపముఖ్యమంత్రి సిసోడియా వెల్లడించారు.

అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన వెంటనే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, పోలీసు సిబ్బంది కుటుంబాలకు కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఒక సైనికుడిని కోల్పోవడం దేశానికి ఎప్పుడూ బాధాకరమే.. వారి కుటుంబానికి అది కోలుకోలేని దెబ్బే అవుతుంది. వారి కుటుంబం గౌరవంగా జీవించడానికి ప్రభుత్వం సహాయపడుతుంది అని సిసోడియా చెప్పారు.

ఢిల్లీ పోలీసులకు చెందిన సంకేత్ కౌశిక్ విధి నిర్వహణలో మరణించాడు. రాజోక్రీ ఫ్లైఓవర్ సమీపంలో అతివేగంగా వచ్చిన ట్రక్ అతనిని ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భారత వైమానిక దళ ఫ్లైట్ లెఫ్టినెంట్ సునీల్ మొహంతి, రాజేష్ కుమార్ లకు చెందిన ఎఎన్ -32 విమానం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో కుప్పకూలింది, వీరిద్దరూ ప్రాణాలు కోల్పోగా వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటానని ప్రకటించింది.

రూ. కోటి ఎక్స్‌గ్రేషియా పొందుతున్నవారి కుటుంబాలు..

1. సంకేత్ కౌశిక్, ఢిల్లీ పోలీస్
2. రాజేష్ కుమార్, ఎయిర్ ఫోర్స్
3. సునీత్ మొహంతి, ఎయిర్ ఫోర్స్
4. కుమార్, ఎయిర్ ఫోర్స్
5. వికాస్ కుమార్, ఢిల్లీ పోలీసులు
6. ప్రవీష్ కుమార్, సివిల్ డిఫెన్స్