సీఎం మరో వరం : నీటి బిల్లుల బకాయిలు రద్దు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. 200 యూనిట్ల లోపు కరెంటు

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 12:39 PM IST
సీఎం మరో వరం : నీటి బిల్లుల బకాయిలు రద్దు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. 200 యూనిట్ల లోపు కరెంటు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని ఇటీవలే ఆయన ప్రకటించారు. తాజాగా మరో ఆకర్షణీయమైన స్కీమ్ అనౌన్స్ చేశారు. నీటి బిల్లుల బకాయిలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా 13 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్ 30లోగా అందరూ వాటర్ మీటర్లు బిగించుకోవాలని.. మీటర్లు బిగించుకున్న వారికే తాజా పథకం వర్తిస్తుందని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నల్లా కనెక్షన్లకు వాటర్ మీటర్లు బిగించుకోవడం ద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు.

ఈ, ఎఫ్, జీ, హెచ్ కేటగిరీల కిందకి వచ్చే వారికి 100శాతం నీటి బిల్లుల బకాయిలు మాఫీ అవుతాయన్నారు. ఏ, బీ కేటగిరీలో ఉన్న వారికి 25శాతం బకాయిలు రద్దు అవుతాయన్నారు. సీ కేటగిరీలో ఉన్న వినియోగదారులకు 50శాతం బకాయిలు మాఫీ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు వాటర్ మీటర్లు బిగించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఆ విధంగా రూ.600 కోట్లు ఆదా చేసినట్ట అవుతుందని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన వారు అవుతారని చెప్పారు.