Delhi : భారత్ బంద్, ఢిల్లీ – గుర్‌గ్రామ్ భారీ ట్రాఫిక్ జాం, ఎక్కడి వాహనాలు అక్కడే

భారత్‌ బంద్‌ కారణంగా ఢిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Delhi : భారత్ బంద్, ఢిల్లీ – గుర్‌గ్రామ్ భారీ ట్రాఫిక్ జాం, ఎక్కడి వాహనాలు అక్కడే

Delhi

Delhi-Gurugram Border : భారత్‌ బంద్‌ కారణంగా ఢిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీలో రైతు సంఘం నేతల ఆందోళనలలో భాగంగా రహదారులను దిగ్బంధించారు. భారత్‌ బంద్‌తో ఢిల్లీ స్తంభించింది. సంయుక్త కిసాన్ మంచ్ సోమవారం పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకి సోమవారంతో ఏడాది పూర్తవడంతో రైతులంతా ముక్త కంఠంతో కొత్త చట్టాల్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై 10 నెలలుగా రైతులు పోరాటం చేస్తుండగా.. సోమవారం చేపట్టిన భారత్‌ బంద్‌కు దాదాపు 500కుపైగా రైతు సంఘాలు, జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.

Read More : Drugs Mafia : హైదరాబాద్‌తో డ్రగ్స్ మాఫియాకు లింక్ ? షాకింగ్ న్యూస్

కమ్యూనిస్టు పార్టీలతో పాటు బంద్‌కు మద్దతు తెలిపిన పార్టీల నాయకులు డిపోల దగ్గర బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశారు. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతున్నారు రైతన్నలు. సాగు చట్టాల రద్దుతో పాటు లేబర్‌ కోడ్స్ ను రద్దు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా కోరుతోంది. ప్రతి పంటకు కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

Read More : Warangal : పోలీసు అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి..వరంగల్‌లో లిక్కర్ డాన్

బంద్‌కు కాంగ్రెస్ సహా వామపక్షాలు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు మద్దతు ప్రకటించాయి. ఈ ఆరు రాష్ట్రాల్లో కార్మిక, ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు, స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నాయి. పంజాబ్‌లో బార్నాల రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌పట్టాలపై  రైతులు నిరసనకు దిగారు. అటు బీహార్‌, హర్యానాలలో షాపులు మూసేశారు. ఘాజీపూర్‌ సరిహద్దుల్లో రైతులు రోడ్లపై బైఠాయించారు. రోడ్డుపైనే వంట, వార్పు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. అటు బంద్‌కు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడెరేషన్‌ కూడా మద్దతు తెలిపింది. బంద్‌ దృష్ట్యా ఢిల్లీ సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు.