ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ : చలిలోనే రోడ్లపై రైతుల బస, టియర్ గ్యాస్ ప్రయోగం

  • Published By: madhu ,Published On : November 27, 2020 / 09:39 AM IST
ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ : చలిలోనే రోడ్లపై రైతుల బస, టియర్ గ్యాస్ ప్రయోగం

Delhi – Haryana border : ఢిల్లీ – హర్యానా రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. చలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా..హస్తిన బయలుదేరిన రైతులను సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే రైతులు బైఠాయించారు. రాత్రంతా..చలిలో చీకట్లోనే ఎక్కడివారెక్కడే బస చేశారు. అంబాలా, శంభు, ఫరీదాబాద్, గురుగావ్, నోయిడా సరిహద్దులో భారీ సంఖ్యలో రైతులు ఉన్నారు. ట్రాక్టర్లలో బయలుదేరిన కొంతమంది రైతులు పానిపట్ వద్ద నిలిచిపోయారు. అడ్డుకొనేందుకు సాయుధ బలగాలు ప్రయత్నిస్తున్నారు. బారికేడ్లు, ఇనుమకంచెలను ఏర్పాటు చేశారు.



కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిన కొన్నాళ్ల పాటు ఆందోళనలు జరుగుతున్నాయి. వ్యవసాయ చట్టాల కారణంగా..రైతులకు కలిగే నష్టాన్ని దేశ ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లేందుకు చలో ఢిల్లీ పేరిట భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. హర్యానా నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చారు. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు వారితో జత కలిశారు.
ముందుగానే హర్యాన ప్రభుత్వం స్పందించింది. ఈ ఆందోళనకు అనుమతిని ఇవ్వలేదు.



https://10tv.in/do-not-have-a-straw-and-sipper-to-give-stan-swamy-nia-tells-court/
దేశ రాజధాని ఢిల్లీలోకి వెళ్లనీయకుండా..భారీగా సాయుధ బలగాలను సరిహద్దులకు తరలించింది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీ, హర్యానా సరిహద్దులను మూసివేసింది. రెండు రాష్ట్రాల్లోని ఐదు సరిహద్దుల వద్ద అడ్డుకోవడంతో వారంతా అక్కడనే ఉండిపోయారు. ఆహారం, బట్టలతో ముందుగానే సిద్ధం చేసుకుని ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. సరిహద్దులు మూసివేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం మాత్రం డిసెంబర్ 03 వరకు ఆగాలని, చర్చలు జరుపుతామని వ్యవశాఖ మంత్రి చెబుతున్నారు. కానీ..తమ గోడును వెళ్లబుచ్చుకోవాలని ముందుకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నా రైతులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాల్‌లను ప్రయోగించారు.