Kejriwal : కోలుకుంటున్నప్పటికీ..ఢిల్లీలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.

Kejriwal : కోలుకుంటున్నప్పటికీ..ఢిల్లీలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

Delhi Has Seen Recovery But Lockdown Extended By Another Week

Delhi ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం వర్చువల్‌గా జరిగిన మీడియాలో సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ…ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ సోమవారం(మే-17,2021)తో ముగియనున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సోమవారం(మే-24,2021) ఉదయం 5గంటల వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని కేజ్రీవాల్ తెలిపారు. లాక్‌డౌన్ సత్ఫలితాన్నిస్తోందని, పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయని…ఈ ప్రయోజనం కోల్పోకూడదనే లాక్‌డౌన్ కొద్ది రోజులు కొనసాగిస్తున్నట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

ఢిల్లీలో మొదట ఏప్రిల్‌ 19న లాక్‌డౌన్‌ అమలులోకి కాగా.. పెరుగుతున్న కొవిడ్‌ కేసుల మధ్య ఇప్పటికి నాలుగుసార్లు పొడగించారు. ఇక,ఢిల్లీలో ఏప్రిల్‌ మధ్యలో పాజిటివిటీ రేటు 35 శాతం ఉండగా…ప్రస్తుతం 11శాతానికి పడిపోయిందని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇది ఐదు శాతానికి చేరుకుంటేనే ముప్పు తగ్గినట్టు భావించాలని వైద్యులు వ్యాఖ్యానించారు. కాగా,శనివారం ఢిల్లీలో 6,500 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి.

కాగా, పలు రాష్ట్రాల్లో విధించబడిన లాక్‌డౌన్ లేదా ఆంక్షలు ఆంక్షలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్ తరహా ఆంక్షలను అమలు చేయడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు మూడు రోజులు నుంచి తగ్గుతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 3.11 లక్షల కేసులు, 4 వేల మరణాలు చోటుచేసుకున్నాయి. 25 రోజుల తర్వాత దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గడం ఇదే తొలిసారి.