Black Fungus Drugs : ప్రాణాలు కాపాడే మందులపై దిగుమతి సుంకం సరికాదు : ఢిల్లీ హైకోర్టు

‘ప్రజలకు కాపాడే మందులపై దిగుమతి సుంకాన్ని విధించటం సరికాదని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంజెక్షన్ల దిగుమతిపై సుంకాన్ని విధించటాన్ని కోర్టు తప్పు పట్టింది. ఈ మందులపై కష్టమ్ డ్యూటీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిచింది.

Black Fungus Drugs : ప్రాణాలు కాపాడే మందులపై దిగుమతి సుంకం సరికాదు : ఢిల్లీ హైకోర్టు

Delhi Hc

Black Fungus Drugs  import duty : ఓ పక్కన కరోనా సెకండ్ వేవ్ భారత ప్రజల్ని అల్లాడిస్తోంది. దానికి తోడు పులిమీద పుట్రలా కరోనా నుంచి కోలుకున్న రోగుల్ని బ్లాక్ ఫంగస్ హడలెత్తిస్తోంది. దేశంలో దాదాపు 9వేల బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ చికిత్స్ కోసం వచ్చిన ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ లో కొత్త దందాకు శ్రీకారం చుట్టాయి. దీంతో బ్లాక్ ఫంగస్ డ్రగ్స్ ధరలు భారీగా పెరిగిపోయాయి. సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. ఈక్రమంలో బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన ఇంజెక్షన్లను భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ డ్రగ్స్ పై కేంద్ర ప్రభుత్వం దిగుమతి పన్నును విధిస్తోంది.

బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల ధరలపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ‘ప్రజలకు కాపాడే మందులపై దిగుమతి సుంకాన్ని భారీగా విధించటం సరికాదని సూచించింది. ప్రజల ప్రాణాలు కాపాడే మందులపై దిగుమతి సుంకాన్ని భారీగా విధించటం సరికాదని..ఇది సరైంది కాదంది. కష్టమ్ డ్యూటీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిచింది.

ప్రజలకు కావాల్సిన మందులను అందించటం ప్రభుత్వం బాద్యత అని ఇటువంటి మెడిసిన్స్ పై దిగుమతి సుంకం విధిస్తే ఆ మెడిసిన్స్ మరింతగా ధరలు పెరిగిన అందుబాటులో లేకుండాపోతాయని తెలిపింది. ఎవరైనా బ్లాక్ ఫంగస్ కు సంబంధించిన మందులు అడిగితే వారికి బాండ్ ఇవ్వాలని వారికి ఎటువంటి పన్ను విధించరాదని తెలిపింది.

కోర్టు ఇచ్చి ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంపై సీబీడీటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేస్తామని తెలిపింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

కరోనా నుంచి కోలుకున్నా పలువురు బ్లాక్ ఫంగస్ భారిన పడుతున్నారు. వీరికి చికిత్స చేయాలంటే ‘Amphotericin’ అవసరం పడుతోంది. ఈ క్రమంలో ఈ Amphotericin ఇంజెక్షన్లు చాలా తక్కువగా ఉండటంతో భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇలా విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ డ్రగ్స్ పై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం విధించటంతో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని మందలించింది. ప్రజల ప్రాణాలు కాపాడే మందులపై దిగుమతి సుంకాన్ని విధించవద్దని సూచించింది.